బీజేపీకి అన్నామలై రాజీనామా.. ఆమోదించిన అధిష్ఠానం
- అధికారికంగా ప్రకటించిన నితిన్ నబీన్
- బుజ్జగించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలం
- కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టేందుకు యోచన
- పొత్తుల విషయంలో విభేదాల వల్లే రాజీనామా
- తమిళనాడు బీజేపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ
కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ను కలిసి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. అధిష్ఠానం దాన్ని ఆమోదించింది. అన్నామలై పార్టీలోనే కొనసాగేలా చూసేందుకు బీజేపీ అగ్రనాయకత్వం చివరి నిమిషం వరకు యత్నించింది. అయినప్పటికీ ఆయన మాత్రం తన నిర్ణయానికే మొగ్గు చూపారు.
తమిళనాడులో సొంతంగా బలాన్ని పెంచుకోకుండా ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలనే కేంద్ర నాయకత్వ వ్యూహాలపై అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలోనే ‘తమిళ్ ఫస్ట్’ అనే నినాదంతో ఓ సరికొత్త ప్రాంతీయ పార్టీని పెట్టబోతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబున్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై నిష్క్రమణ తమిళనాడులో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. దూకుడుగా సాగించిన ప్రచారం, ప్రత్యర్థులపై చేసిన పదునైన విమర్శలే ఆ రాష్ట్రంలో బీజేపీని ఒక బలమైన శక్తిగా నిలబెట్టాయని నిపుణులు చెబుతున్నారు.