ఇరాన్‌పై యుద్ధం ఆపాల్సిందే.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ, యూఎస్ హౌస్‌లో సంచలన తీర్మానం!
- ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలను నిలిపివేయాలని ప్రతినిధుల సభ డిమాండ్
- ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా 215-208 ఓట్ల తేడాతో తీర్మానం ఆమోదం
- డెమొక్రాట్లతో కలిసి ఓటింగ్ లో పాల్గొన్న పలువురు రిపబ్లికన్ పార్టీ సభ్యులు
- ఓటింగ్‌ను నిలిపివేయాలని చూసిన హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ వ్యూహం ఫ్లాప్
సభలో బుధవారం జరిగిన హోరాహోరీ ఓటింగ్‌లో ఈ తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 208 ఓట్లు పడ్డాయి. అయితే, ఈ తీర్మానం సభలో నెగ్గినప్పటికీ, దీని భవిష్యత్తు, తుది అమలుపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ ఓటింగ్ జరగకుండా, తద్వారా ఇరాన్ యుద్ధంపై సొంత ప్రభుత్వంలోనే ఉన్న వ్యతిరేకత బయటపడకుండా చూసేందుకు హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ తీవ్రంగా శ్రమించారు. రెండు వారాల క్రితం ఈ తీర్మానం ఆమోదం పొందేలా కనిపించినప్పుడు.. స్పీకర్ జాన్సన్ సభా కార్యకలాపాలను అకస్మాత్తుగా నిలిపివేసి కాలయాపన చేశారు. అయినప్పటికీ ప్రజాప్రతినిధులలో పెరుగుతున్న అసంతృప్తిని ఆయన అడ్డుకోలేకపోయారు.
ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధం సుదీర్ఘంగా సాగుతుండటం, మరోవైపు ఈ సంక్షోభాన్ని ముగించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేగవంతమైన చర్చలు జరపడంలో విఫలం కావడమే ఈ రాజకీయ తిరుగుబాటుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం ముగింపునకు సంబంధించిన శాంతి ప్రణాళికను (Peace plan) ముందుకు తీసుకెళ్లడంలో ట్రంప్ ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో, అటు ప్రజల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒకవైపు ఇజ్రాయెల్-లెబనాన్ల మధ్య శాంతి చర్చలు ఫలించిన తరుణంలో.. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలను సొంత పార్లమెంటే తప్పుబట్టడం ట్రంప్ యంత్రాంగాన్ని ఆత్మరక్షణలో పడేసింది.