సౌరవ్ గంగూలీకి భద్రత తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
- జెడ్ కేటగిరీ నుంచి వై కేటగిరీకి సెక్యూరిటీ కుదింపు
- కొత్తగా ఏర్పడిన సువేందు అధికారి సర్కార్ కీలక నిర్ణయం
- వీఐపీ భద్రతపై సమీక్షలో భాగంగా ఈ మార్పులు
'జెడ్' కేటగిరీ కింద గంగూలీకి దాదాపు 35 మంది సిబ్బంది, పైలట్ వాహనంతో సహా పటిష్ఠమైన భద్రత ఉండేది. తాజా నిర్ణయంతో 'వై' కేటగిరీ కింద కేవలం 3-4 మంది సిబ్బంది మాత్రమే ఉంటారు. వీరిలో ఇద్దరు సాయుధ అధికారులు గంగూలీకి సమీప భద్రతను పర్యవేక్షిస్తారు.
పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత పాలనలో పలువురు ప్రముఖులకు కేటాయించిన వీఐపీ భద్రతపై సమీక్ష చేపట్టింది. నిజమైన ముప్పు అంచనా ఆధారంగానే భద్రత కల్పించాలని, వనరులను హేతుబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ సమీక్షలో భాగంగానే గంగూలీ భద్రతను తగ్గించినట్లు తెలుస్తోంది. మరికొంతమంది ప్రముఖులు, టీఎంసీ నేతల భద్రతను కూడా ప్రభుత్వం సవరించింది.
ప్రస్తుతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబీ) అధ్యక్షుడిగా కొనసాగుతున్న గంగూలీ, భద్రత తగ్గింపు నిర్ణయంపై ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.