'స్పిరిట్' సెట్స్ నుంచి ప్రభాస్ ఫొటో షేర్ చేసిన స్టైలిస్ట్.. ఇంటర్నెట్‌లో రచ్చ!

Entertainment
Advertisement
  • 'స్పిరిట్' సెట్స్ నుంచి ప్రభాస్ కొత్త లుక్ వైరల్
  • స్టైలిష్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కనిపించిన డార్లింగ్
  • ఫొటో షేర్ చేసి, ఆపై డిలీట్ చేసిన హెయిర్‌స్టైలిస్ట్
  • ఫోటోతో ఫ్యాన్స్‌లో జోష్
  • ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్
Advertisement
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'స్పిరిట్' సెట్స్ నుంచి ఆయన కొత్త లుక్‌కు సంబంధించిన ఓ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా, ఈ ఫోటో వాటిని మరింత పెంచింది.

వివరాల్లోకి వెళితే, 'స్పిరిట్' చిత్ర బృందంలోని హెయిర్‌స్టైలిస్ట్ ఒకరు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ ఫోటోను షేర్ చేశారు. ఇందులో ప్రభాస్ ఎంతో స్టైలిష్‌గా బ్లాక్ డ్రెస్‌లో కనిపించారు. అయితే, పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆ ఫోటోను డిలీట్ చేశారు. కానీ అప్పటికే ఆ ఫోటో స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నిజానికి ఈ ఫోటో మే 26న తీసిందని తెలిసినప్పటికీ, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ కొత్త లుక్‌పై ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన వస్తోంది. తమ హీరోను కొత్త అవతార్‌లో చూసి మురిసిపోతూ, వెంటనే సినిమా నుంచి అధికారిక ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం 'స్పిరిట్' సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని విమల్ థియేటర్, బాలానగర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. 

ఈ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ సరసన తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ ప్రధాన విలన్‌గా కనిపించనున్నారు. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

PrabhasSpiritHair StylistSandeep Reddy VangaMovieTollywood

More Telugu News

'మురసు' తుపాను కల్లోలం.. ప్రకాశం జిల్లాలో హైఅలర్ట్!

02 Nov, 22:26

హైదరాబాద్ శివార్లలో అక్రమ బోర్లను టార్గెట్ చేసిన హైడ్రా

02 Nov, 22:13

గుడ్ న్యూస్.. రాప్తాడు బాలిక ఆరోగ్యంపై మంత్రి నారా లోకేశ్ అప్ డేట్

02 Nov, 22:05

అమిత్ షాతో భేటీపై సోషల్ మీడియాలో స్పందించిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 21:52

ఆరేళ్లలో అతిపెద్ద జంప్.. మళ్లీ భారత నెం.1 కుబేరుడిగా ముకేశ్ అంబానీ

02 Nov, 21:39

మనకు ఇష్టమైన గోరింక పిట్ట ఆస్ట్రేలియన్లకు ఎందుకు నచ్చదు?

02 Nov, 21:19

హైదరాబాద్‌లో అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 20:59

'అర్నబ్' తుపానుతో పోలిస్తే 'మురసు' తీవ్రత తక్కువే.. అయినా అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

02 Nov, 20:47

తుపాను ప్రభావిత ఏపీకి కర్ణాటక సాయం.. రంగంలోకి 500 మంది సిబ్బంది

02 Nov, 20:35

'రుద్రవనం పీఎస్' (జీ 5) సిరీస్ రివ్యూ!

02 Nov, 20:15

ఏపీ పుర పోరు: ముగిసిన రీపోలింగ్.. రేపు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

02 Nov, 20:08

'ఓ మైసా రే'.. రష్మిక 'మైసా' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

02 Nov, 19:52

కుల్దీప్ ను సిరీస్ మొత్తం పక్కనబెట్టడం ఆశ్చర్యంగా ఉంది: వెంకటపతిరాజు

02 Nov, 19:37

దేశంలో పెరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటున్న పైలట్ల సమాఖ్య

02 Nov, 19:24

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌: భారత-ఏ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. జట్టులో హేమాహేమీలకు చోటు!

02 Nov, 19:01
..More Telugu News