తెలంగాణకు వర్ష సూచన.. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Telangana
Advertisement
  • ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన
  • 18 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • రేపటి లోగా కేరళ, తమిళనాడును తాకనున్న నైరుతి రుతుపవనాలు
Advertisement

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం ఉండనుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండతో కలిపి మొత్తం 18 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు 'ఆరెంజ్' అలర్ట్ ప్రకటించారు.


ఈ భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు, దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు రేపటిలోగా కేరళ, తమిళనాడు తీరాలను తాకనున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాత్రంతా ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. రాబోయే రెండు రోజులు మరిన్ని భారీ వర్షాల సూచన ఉన్నందున, ముఖ్యంగా రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

సంబంధిత వార్తలు

RainTelangana

More Telugu News

'మురసు' తుపాను కల్లోలం.. ప్రకాశం జిల్లాలో హైఅలర్ట్!

02 Nov, 22:26

హైదరాబాద్ శివార్లలో అక్రమ బోర్లను టార్గెట్ చేసిన హైడ్రా

02 Nov, 22:13

గుడ్ న్యూస్.. రాప్తాడు బాలిక ఆరోగ్యంపై మంత్రి నారా లోకేశ్ అప్ డేట్

02 Nov, 22:05

అమిత్ షాతో భేటీపై సోషల్ మీడియాలో స్పందించిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 21:52

ఆరేళ్లలో అతిపెద్ద జంప్.. మళ్లీ భారత నెం.1 కుబేరుడిగా ముకేశ్ అంబానీ

02 Nov, 21:39

మనకు ఇష్టమైన గోరింక పిట్ట ఆస్ట్రేలియన్లకు ఎందుకు నచ్చదు?

02 Nov, 21:19

హైదరాబాద్‌లో అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 20:59

'అర్నబ్' తుపానుతో పోలిస్తే 'మురసు' తీవ్రత తక్కువే.. అయినా అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

02 Nov, 20:47

తుపాను ప్రభావిత ఏపీకి కర్ణాటక సాయం.. రంగంలోకి 500 మంది సిబ్బంది

02 Nov, 20:35

'రుద్రవనం పీఎస్' (జీ 5) సిరీస్ రివ్యూ!

02 Nov, 20:15

ఏపీ పుర పోరు: ముగిసిన రీపోలింగ్.. రేపు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

02 Nov, 20:08

'ఓ మైసా రే'.. రష్మిక 'మైసా' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

02 Nov, 19:52

కుల్దీప్ ను సిరీస్ మొత్తం పక్కనబెట్టడం ఆశ్చర్యంగా ఉంది: వెంకటపతిరాజు

02 Nov, 19:37

దేశంలో పెరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటున్న పైలట్ల సమాఖ్య

02 Nov, 19:24

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌: భారత-ఏ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. జట్టులో హేమాహేమీలకు చోటు!

02 Nov, 19:01
..More Telugu News