అబ్బాయ్ సినిమాకు బాబాయ్ ఆశీస్సులు.. 'పెద్ది' కోసం పవన్ స్పెషల్ వీడియో!

Entertainment
Advertisement
  • 'పెద్ది' సినిమా కోసం రామ్ చరణ్‌కు పవన్ కల్యాణ్ ప్రత్యేక విషెస్
  • విజయం ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియో విడుదల
  • చరణ్ వ్యక్తిత్వాన్ని ఆంజనేయస్వామి స్వరూపంతో పోల్చిన పవన్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పవన్ కల్యాణ్ వీడియో
  • బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు
Advertisement
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన‌ 'పెద్ది' సినిమాపై అంచనాలు పెరుగుతున్న వేళ.. జనసేన అధినేత, చెర్రీ బాబాయ్ పవన్ కల్యాణ్ ఆ చిత్రానికి తన మద్దతు తెలిపారు. 'పెద్ది' టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన విడుదల చేసిన ఓ ప్రత్యేక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ 'ఎక్స్' ఖాతా ద్వారా విడుదలైన ఈ వీడియోలో రామ్ చరణ్ సినీ ప్రయాణంలోని పలు ముఖ్యమైన సన్నివేశాలను పొందుపరిచారు. రామ్ చరణ్ అనే పేరులోనే శ్రీరామభక్తుడైన హనుమంతుడి లక్షణాలు ఉన్నాయని, ఆయన భక్తి, శక్తి, సమర్పణ భావాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పోలిక అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న 'పెద్ది' చిత్రం రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండగా, పవన్ స్వయంగా వీడియో విడుదల చేయడం ఆ అంచనాలను మరింత పెంచింది. 'పెద్ది' సినిమా మార్గంలో ఎలాంటి అడ్డంకులు ఎదురవకుండా ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలని, ఈ చిత్రం ఘన విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాలని పవన్ కల్యాణ్ తన వీడియోలో ఆకాంక్షించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.
Advertisement

సంబంధిత వార్తలు

Peddi MoviePawan KalyanSpecial WishesRam Charan

More Telugu News

'మురసు' తుపాను కల్లోలం.. ప్రకాశం జిల్లాలో హైఅలర్ట్!

02 Nov, 22:26

హైదరాబాద్ శివార్లలో అక్రమ బోర్లను టార్గెట్ చేసిన హైడ్రా

02 Nov, 22:13

గుడ్ న్యూస్.. రాప్తాడు బాలిక ఆరోగ్యంపై మంత్రి నారా లోకేశ్ అప్ డేట్

02 Nov, 22:05

అమిత్ షాతో భేటీపై సోషల్ మీడియాలో స్పందించిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 21:52

ఆరేళ్లలో అతిపెద్ద జంప్.. మళ్లీ భారత నెం.1 కుబేరుడిగా ముకేశ్ అంబానీ

02 Nov, 21:39

మనకు ఇష్టమైన గోరింక పిట్ట ఆస్ట్రేలియన్లకు ఎందుకు నచ్చదు?

02 Nov, 21:19

హైదరాబాద్‌లో అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 20:59

'అర్నబ్' తుపానుతో పోలిస్తే 'మురసు' తీవ్రత తక్కువే.. అయినా అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

02 Nov, 20:47

తుపాను ప్రభావిత ఏపీకి కర్ణాటక సాయం.. రంగంలోకి 500 మంది సిబ్బంది

02 Nov, 20:35

'రుద్రవనం పీఎస్' (జీ 5) సిరీస్ రివ్యూ!

02 Nov, 20:15

ఏపీ పుర పోరు: ముగిసిన రీపోలింగ్.. రేపు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

02 Nov, 20:08

'ఓ మైసా రే'.. రష్మిక 'మైసా' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

02 Nov, 19:52

కుల్దీప్ ను సిరీస్ మొత్తం పక్కనబెట్టడం ఆశ్చర్యంగా ఉంది: వెంకటపతిరాజు

02 Nov, 19:37

దేశంలో పెరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటున్న పైలట్ల సమాఖ్య

02 Nov, 19:24

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌: భారత-ఏ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. జట్టులో హేమాహేమీలకు చోటు!

02 Nov, 19:01
..More Telugu News