అల్లు అర్జున్ 'రాకా'లో 'మిన్నల్ మురళి' బ్యూటీ

  • అల్లు అర్జున్ - అట్లీ కాంబో చిత్రం 'రాకా'లో ఫెమీనా జార్జ్
  • బన్నీకి 'హ్యాపి' సినిమా నుంచి అభిమానినని చెప్పిన ఫెమీనా
  • ఇది తన కెరీర్‌లోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అని వెల్లడి
  • దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న సై-ఫై యాక్షన్ సినిమా
  • మరో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉందంటూ ప్రచారం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'రాకా'. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ప్రధాన హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టులోకి మలయాళ నటి ఫెమీనా జార్జ్ కూడా అడుగుపెట్టారు.

'మిన్నల్ మురళి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫెమినా, 'రాకా'లో భాగం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. తన కెరీర్‌లోనే ఇది అతిపెద్ద ప్రాజెక్ట్ అని ఆమె తెలిపారు. అల్లు అర్జున్‌తో కలిసి స్క్రీన్ పంచుకోవడం ఒక కల నిజమైన క్షణమని ఆమె అభివర్ణించారు. అల్లు అర్జున్ నటించిన 'హ్యాపీ' సినిమా చూసినప్పటి నుంచి తాను ఆయనకు పెద్ద అభిమానిని అయిపోయానని ఫెమీనా పేర్కొన్నారు. తన పాత్ర నిడివి చిన్నదే అయినా, ఇంత భారీ చిత్రంలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు వివరించారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉండొచ్చని ప్రచారం జరుగుతుండగా, జాన్వీ కపూర్, రష్మిక మందన్న వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సై-ఫై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మిన్నల్ మురళి చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫెమీనా జార్జ్

టొవినో థామస్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'మిన్నల్ మురళి'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యువ నటి ఫెమీనా జార్జ్, తన కెరీర్‌ను ఆచితూచి ప్లాన్ చేసుకుంటున్నారు. తొలి సినిమాతో వచ్చిన భారీ విజయం తర్వాత, పాత్రల ఎంపికలో ఎంతో పట్టింపుగా వ్యవహరిస్తూ విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు.

ఇటీవల ఆమె నటించిన 'కరక్కం' అనే మ్యూజికల్ హారర్ కామెడీ చిత్రం బక్రీద్ సందర్భంగా మే 28న థియేటర్లలో విడుదలైంది. సుభాష్ లలిత సుబ్రహ్మణియన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనాథ్ భాసి సరసన ఆమె నటించారు. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతోందని టాక్ వస్తోంది.

'మిన్నల్ మురళి'లో బ్రూస్ లీ లతిక అనే కరాటే శిక్షకురాలి పాత్రలో ఫెమీనా నటనకు మంచి మార్కులు పడ్డాయి. సౌదీ అరేబియాలో పుట్టి, కేరళలో చదువుకున్న ఆమె, మోడలింగ్ నుంచి నటన వైపు వచ్చారు. ఆ తర్వాత 'తీప్పొరి బెన్నీ', 'శేషం మైకేల్ ఫాతిమా' వంటి చిత్రాల్లో నటించినా, 'మిన్నల్ మురళి' పాత్రనే ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుంచుకున్నారు.

ప్రస్తుతం ఫెమీనా 'హైకూ' అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కేరళలోని ఇడుక్కిలో ప్రారంభమైంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఫెమినా, విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునే ప్రయత్నంలో ఉన్నారు.

Femina George
Allu Arjun
RAAKA movie
Deepika Padukone
Atlee director
Minnal Murali
Tollywood news
South Indian cinema
Malayalam actress
Science fiction action movie

More Telugu News