కోహ్లీతో అనుష్క స్టెప్పులు: ఆర్సీబీ రిపీట్ హిస్టరీ వేళ.. వైరల్ అవుతోన్న ‘విరుష్క’ విక్టరీ డ్యాన్స్!
- స్టేడియంలో భార్యకు ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చిన రన్ మెషీన్
- బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తీక్‌తో కలిసి విరాట్ జోష్
- సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆఫ్టర్ పార్టీ వీడియో
అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో ఘన విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. వరుసగా రెండో కప్పును తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో సాధించిన ఈ చారిత్రాత్మక విజయం తర్వాత.. పిచ్‌పై ఎంత హంగామా జరిగిందో, అంతకు మించిన అసలైన సెలబ్రేషన్స్ 'ఆఫ్టర్ పార్టీ'లో ఆవిష్కృతమయ్యాయి.
కెప్టెన్ రజత్ పటీదార్, జట్టు సభ్యులు, సపోర్టింగ్ స్టాఫ్ కుటుంబాలతో కలిసి చేసుకున్న సక్సెస్ పార్టీలో.. స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆర్సీబీ అధికారికంగా పంచుకున్న ఈ వీడియోలో ఈ జంట ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ, ఆనందంతో ఒకరినొకరు హగ్ చేసుకుంటూ కనిపించారు. ఈ వేడుకల్లో విరాట్ కోహ్లీ తన జట్టు బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తీక్‌తో కలిసి వేసిన మాస్ స్టెప్పులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అయితే, ఈ పార్టీలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం విరాట్ కోహ్లీ ధరించిన ప్రత్యేకమైన టీషర్ట్. దానిపై "One felt nice, we did twice" (ఒక్కసారి గెలిస్తే బాగుంటుంది, కానీ మేము రెండుసార్లు చేసి చూపించాం) అని రాసి ఉన్న క్యాప్షన్ ఆర్‌సీబీ సాధించిన బ్యాక్ టు బ్యాక్ టైటిల్ విజయానికి పక్కాగా సరిపోయింది. ఈ కూల్ టీషర్ట్‌తో ఉన్న కోహ్లీ ఫొటోను అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ లవ్ ఎమోజీని జత చేసింది.
అంతకుముందు మ్యాచ్ ముగిసిన వెంటనే వీఐపీ స్టాండ్స్‌లో ఉన్న అనుష్క లేచి నిలబడి చప్పట్లతో భర్తను, జట్టును అభినందించగా.. మైదానంలో ఉన్న విరాట్ కోహ్లీ ఆమె వైపు చూస్తూ గాల్లోకి ముద్దులు (ఫ్లయింగ్ కిస్సెస్) విసరడం, దానికి ఆమె మురిసిపోవడం వంటి దృశ్యాలు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. భర్త సాధించిన చారిత్రాత్మక విజయంలో భాగస్వామి అవుతూ అనుష్క శర్మ చేసిన సందడి ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.