రోజూ పాలు తాగుతావా?.. వైభవ్ కు రవిశాస్త్రి సరదా ప్రశ్న!

Sports
Advertisement
  • రవిశాస్త్రితో సరదా సంభాషణలో ఆకట్టుకున్న వైభవ్
  • బంతిని బలంగా బాదడానికి రోజూ ఎన్ని పాలు తాగుతావ్? అని అడిన రవిశాస్త్రి
  • ప్ర‌స్తుతం తాను పాలు తాగ‌డం లేద‌ని చెప్పిన యువ సంచ‌ల‌నం
  • ఐపీఎల్ 2026లో ఐదు అవార్డులు గెలుచుకున్న వైభవ్ సూర్యవంశీ
Advertisement
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతం సృష్టించాడు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ అనంతరం 15 ఏళ్ల ఈ కుర్రాడు ఏకంగా ఐదు వ్యక్తిగత అవార్డులను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో 776 పరుగులతో పరుగుల వరద పారించిన వైభవ్.. తన అద్భుత ప్రదర్శనకు తగిన గుర్తింపు పొందాడు.

ఈ సీజన్‌లో వైభవ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఆరెంజ్ క్యాప్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ సిక్సెస్ అవార్డులను గెలుచుకున్నాడు. కేవలం 15 ఏళ్ల 65 రోజుల వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతేడాది 23 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన సాయి సుదర్శన్ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు.

అంతేకాదు ఈ సీజన్‌లో మొత్తం 72 సిక్సర్లు బాది, ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ (59) రికార్డును కూడా తుడిచిపెట్టాడు. అవార్డుల ప్రదానోత్సవం తర్వాత భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి.. వైభవ్‌తో సరదాగా ముచ్చటించాడు. "ఇంత చిన్న వయసులో ఇంత బలంగా బంతిని బాదడానికి రోజూ ఎన్ని పాలు తాగుతావ్?" అని శాస్త్రి హిందీలో అడగ్గా.. "నేనిప్పుడు పాలు తాగడం లేదు" అని వైభవ్ నవ్వుతూ సమాధానమిచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు.
Advertisement

సంబంధిత వార్తలు

Vaibhav SuryavanshiIPL 2026Rajasthan RoyalsRavi ShastriOrange CapSai SudharsanChris GayleMost SixesEmerging Player

More Telugu News

'మురసు' తుపాను కల్లోలం.. ప్రకాశం జిల్లాలో హైఅలర్ట్!

02 Nov, 22:26

హైదరాబాద్ శివార్లలో అక్రమ బోర్లను టార్గెట్ చేసిన హైడ్రా

02 Nov, 22:13

గుడ్ న్యూస్.. రాప్తాడు బాలిక ఆరోగ్యంపై మంత్రి నారా లోకేశ్ అప్ డేట్

02 Nov, 22:05

అమిత్ షాతో భేటీపై సోషల్ మీడియాలో స్పందించిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 21:52

ఆరేళ్లలో అతిపెద్ద జంప్.. మళ్లీ భారత నెం.1 కుబేరుడిగా ముకేశ్ అంబానీ

02 Nov, 21:39

మనకు ఇష్టమైన గోరింక పిట్ట ఆస్ట్రేలియన్లకు ఎందుకు నచ్చదు?

02 Nov, 21:19

హైదరాబాద్‌లో అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 20:59

'అర్నబ్' తుపానుతో పోలిస్తే 'మురసు' తీవ్రత తక్కువే.. అయినా అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

02 Nov, 20:47

తుపాను ప్రభావిత ఏపీకి కర్ణాటక సాయం.. రంగంలోకి 500 మంది సిబ్బంది

02 Nov, 20:35

'రుద్రవనం పీఎస్' (జీ 5) సిరీస్ రివ్యూ!

02 Nov, 20:15

ఏపీ పుర పోరు: ముగిసిన రీపోలింగ్.. రేపు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

02 Nov, 20:08

'ఓ మైసా రే'.. రష్మిక 'మైసా' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

02 Nov, 19:52

కుల్దీప్ ను సిరీస్ మొత్తం పక్కనబెట్టడం ఆశ్చర్యంగా ఉంది: వెంకటపతిరాజు

02 Nov, 19:37

దేశంలో పెరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటున్న పైలట్ల సమాఖ్య

02 Nov, 19:24

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌: భారత-ఏ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. జట్టులో హేమాహేమీలకు చోటు!

02 Nov, 19:01
..More Telugu News