విశాఖ రైల్వే జోన్ రేపటి నుంచే... సీఎం చంద్రబాబు ఏమన్నారంటే!
- జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం
- ఇది చారిత్రాత్మక మైలురాయి అని సీఎం చంద్రబాబు వ్యాఖ్య
- దశాబ్దాల కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
- ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని మోదీకి, రైల్వే మంత్రికి ధన్యవాదాలు
- ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ జోన్ కీలకం కానుందని వెల్లడి
నూతన రైల్వే జోన్‌తో ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రం సమూలంగా మారిపోతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. దీనివల్ల కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించబడటంతో పాటు పారిశ్రామిక వృద్ధికి కూడా బాటలు పడతాయని తెలిపారు. రాష్ట్రాన్ని ఒక లాజిస్టిక్స్ హబ్‌గా మార్చే ప్రభుత్వ లక్ష్యానికి ఈ పరిణామం ఎంతో దోహదపడుతుందని వివరించారు.
ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చంద్రబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతో ఈ ప్రాంత అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.