అతని చేతికి టేప్ వేయాలేమో.. సుదర్శన్ విచిత్ర ఔట్‌పై గిల్ ఫన్నీ కామెంట్స్!
- గుజరాత్ టైటాన్స్ ఘన విజయంతో ఐపీఎల్ ఫైనల్‌కు
- వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హిట్ వికెట్‌గా ఔటైన సాయి సుదర్శన్
- తన కెరీర్‌లో ఇలాంటిది చూడలేదన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్
- సుదర్శన్‌కు టేప్ వేయాలేమో అంటూ నవ్వుతూ చెప్పిన గిల్
గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2026 ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌పై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు సెంచరీతో చెలరేగి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఓపెనర్ సాయి సుదర్శన్ విచిత్ర రీతిలో ఔటవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై గిల్ స్పందిస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
భారీ షాట్ ఆడే క్రమంలో సాయి సుదర్శన్ తన బ్యాట్‌పై నియంత్రణ కోల్పోయి వికెట్లను గిరాటేశాడు. గత మ్యాచ్‌లోనూ అతను ఇలాగే హిట్ వికెట్‌గా వెనుదిరగడం గమనార్హం. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఒకేలా ఔటవ్వడంపై గిల్ మాట్లాడుతూ.. "నా కెరీర్‌లో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. బహుశా ఎవరూ చూసి ఉండరు" అని అన్నాడు.
అంతేకాదు సుదర్శన్ మళ్లీ అలా ఔటవ్వకుండా ఉండేందుకు ఓ ట్రిక్‌ను పాటిస్తానేమోనని గిల్ సరదాగా వ్యాఖ్యానించాడు. "అతని చేతికి టేప్ వేయాలని సోషల్ మీడియాలో ఓ వీడియో చూశాను. బహుశా వచ్చే మ్యాచ్‌లో నేను అదే చేయాలేమో" అని నవ్వుతూ చెప్పాడు.
ఈ వింత ఔట్‌ను పక్కన పెడితే.. 215 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గిల్, సుదర్శన్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ కేవలం 77 బంతుల్లోనే 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయాన్ని సులువు చేశారు. ఇది ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. ఈ మ్యాచ్‌లో గిల్ 53 బంతుల్లో 104 పరుగులు చేయగా, సుదర్శన్ 32 బంతుల్లో 58 పరుగులతో రాణించాడు. తమ మధ్య మంచి అవగాహన ఉందని, ఒకరి ఆటను మరొకరం బాగా అర్థం చేసుకున్నామని గిల్ వివరించాడు.