కెన్నెడీ సెంటర్ నుంచి ట్రంప్ పేరు తొలగించండి: అమెరికా కోర్టు సంచలన తీర్పు
- కెన్నెడీ సెంటర్‌కు ట్రంప్ పేరు చేర్చడం చట్టవిరుద్ధమన్న కోర్టు తీర్పు
- రెండు వారాల్లోగా ట్రంప్ పేరును తొలగించాలని ఆదేశం
- సెంటర్‌ను రెండేళ్లపాటు మూసివేయాలన్న నిర్ణయం కూడా నిలిపివేత
- బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు తమ అధికారాన్ని అతిక్రమించారని జడ్జి వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. వాషింగ్టన్‌లోని ప్రఖ్యాత జాన్ ఎఫ్.కెన్నెడీ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌కు ఆయన పేరును చేర్చడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ పేరు మార్పు చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ, రెండు వారాల్లోగా సెంటర్ నుంచి ట్రంప్ పేరును తొలగించాలని ఆదేశించింది.
జిల్లా జడ్జి క్రిస్టోఫర్ కూపర్ ఈ మేరకు తీర్పునిచ్చారు. ప్రెసిడెంట్ జాన్ ఎఫ్.కెన్నెడీకి ఏకైక జాతీయ స్మారక చిహ్నంగా ఈ సెంటర్‌ను అమెరికా కాంగ్రెస్ ఏర్పాటు చేసిందని ఆయన గుర్తుచేశారు. సెంటర్ పేరును కాంగ్రెస్ మాత్రమే మార్చగలదని, ఆ అధికారం బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు లేదని స్పష్టం చేశారు. బోర్డు ఏకపక్షంగా వ్యవహరించి తన పరిధిని అతిక్రమించిందని జడ్జి వ్యాఖ్యానించారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కెన్నెడీ సెంటర్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ స్వయంగా బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. గత డిసెంబర్లో బోర్డు సమావేశమై సెంటర్ పేరును ‘ది డొనాల్డ్ జె. ట్రంప్ అండ్ ది జాన్ ఎఫ్. కెన్నెడీ మెమోరియల్ సెంటర్’గా మార్చింది. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, పలువురు కళాకారులు తమ ప్రదర్శనలను రద్దు చేసుకున్నారు.
అంతేకాకుండా, మరమ్మతుల పేరుతో సెంటర్‌ను జులై నుంచి రెండేళ్ల పాటు మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా జడ్జి తాత్కాలికంగా నిలిపివేశారు. పూర్తి సమాచారం లేకుండా, ప్రతికూల పరిణామాలను అంచనా వేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, అవసరమైన మరమ్మతు పనులను కొనసాగించడానికి అనుమతినిచ్చారు.