స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి హాజరైన కడియం శ్రీహరి

Kadiyam Srihari Attends Station Ghanpur Municipality Meeting
  • నూతన కో ఆప్షన్ సభ్యులను సత్కరించిన శ్రీహరి
  • ఒక్కో వార్డుకు రూ. 10 లక్షలు మంజూరు చేయనున్నట్టు వెల్లడి
  • వార్డులో అవసరమైన పనులను గుర్తించాలని సూచన
స్టేషన్ ఘన్ పూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్ఢంగా మున్సిపాలిటీ నూతన కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన రహీమున్నిసా, మాషుఖ్, గన్ను నర్సింహులు, బూర్ల లతలను శాలువాతో సత్కరించారు. మరోవైపు, నూతన కోఆప్షన్ సభ్యులకు మున్సిపల్ కమిషనర్ నియామక పత్రాలను అందజేశారు. 

ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ... కౌన్సిల్ లో ఓటు వేసే హక్కు తప్ప కౌన్సిలర్లకు ఉండే అన్ని హక్కులు కో ఆప్షన్ సభ్యులకు ఉంటాయని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులకు జూన్ 15 నాటికి ఒక్కో వార్డుకు రూ. 10 లక్షలు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. మీ వార్డులో అవసరమైన పనులను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. 

మున్సిపల్ ఎన్నికలకు ముందే స్టేషన్ ఘన్ పూర్ కి రూ. 50 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని... రూ. 8 కోట్ల జనరల్ ఫండ్ ఉందని శ్రీహరి తెలిపారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఇప్పుడు దాదాపు రూ. 60 కోట్ల నిధులతో స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ సంపన్నంగా ఉందని అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన సిబ్బందికి జీతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్, మే నెల పెండింగ్ జీతాలను కూడా జూన్ 1న చెల్లించాలని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అవినీతి రహిత పాలనను అందిస్తూ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని అన్నారు.
Go Back to Shorts
Kadiyam Srihari
Station Ghanpur
Station Ghanpur Municipality
Telangana Municipal Elections
Municipal Council Meeting
Telangana Politics
Local Governance
Telangana Development
Municipal Funds
Co-option Members

More Telugu News