ఆ మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ కంటతడి పెట్టారా?

  • ఫ్యాక్ట్ చెక్‌లో ఎడిట్ చేసిన ఫొటోలు, వీడియోలని తేలిన వైనం
  • కావ్య మారన్ కంటతడి పెడుతుంటే ఇషాన్, ముత్తయ్య ఓదారుస్తున్నట్లు ఫొటోలు వైరల్
  • ఏఐ ద్వారా వీడియోలను రూపొందించిన నెటిజన్లు
ఐపీఎల్ 2026లో భాగంగా రెండురోజుల క్రితం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. దీంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఈ సమయంలో సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ కన్నీరు పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఫ్యాక్ట్ చెక్ చేస్తే, ఆమె కన్నీరు పెట్టుకున్న వీడియోలు ఎడిట్ చేసినవని వెల్లడైంది.

ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్ధేశించిన 244 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ ఛేదించలేక, 196 పరుగులకే కుప్పకూలింది. దీంతో కావ్య మారన్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, కోచ్ ముత్తయ్య మురళీధరన్‌తో కావ్య మారన్ మాట్లాడుతూ ఉన్న ఫొటోలను ఎడిట్ చేసి, సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. కొంతమంది కృత్రిమ మేధ (ఏఐ)ని ద్వారా ఏడుస్తున్నట్లుగా వీడియోలను రూపొందించారు. ఆమె ఏడుస్తుంటే ముత్తయ్య, ఇషాన్ ఓదారుస్తున్నట్లు వీడియోలో ఉంది.

Kavya Maran
Sunrisers Hyderabad
IPL 2024
Rajasthan Royals
Eliminator Match
Muttiah Muralitharan

More Telugu News