సింగిల్ ఛార్జ్‌తో 543 కిలోమీటర్ల మైలేజ్.. టయోటా తొలి ఎలక్ట్రిక్ కార్ ‘ఎబెల్లా’!

  • బ్యాటరీ సామర్థ్యం 61 కిలోవాట్ అవర్స్
  • ప్రారంభ ధర రూ.23.60 లక్షలు
  • గరిష్ఠంగా 171 హార్స్ పవర్ శక్తిని, 189 న్యూటన్ మీటర్ల టార్క్‌ 
  • 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా 
  • ‘లెవెల్ 2 ఏడీఏఎస్’ సాంకేతికత
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి తన తొలి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారు ‘అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా’ను విడుదల చేసింది. ఈ మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాప్ వేరియంట్ ‘E3’ ధరను రూ.23.60 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. మారుతీ సుజుకీ ‘ఈ-విటారా’ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా రూపొందిన ఈ కారు.. మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, టాటా కర్వ్ ఈవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

అదిరిపోయే మైలేజ్
ఇందులో 61 కిలోవాట్ అవర్స్ (కేడబ్ల్యూహెచ్‌) సామర్థ్యం గల శక్తిమంతమైన బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 543 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఈ కారు గరిష్ఠంగా 171 హార్స్ పవర్ శక్తిని, 189 న్యూటన్ మీటర్ల టార్క్‌ను విడుదల చేస్తుంది. స్పోర్టివ్ లుక్‌తో ఉన్న ఈ కారును కేఫ్ వైట్, బ్లూయిష్ బ్లాక్, స్పోర్టింగ్ రెడ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో తీసుకొచ్చారు.

లగ్జరీ ఇంటీరియర్
కారు లోపలి భాగం బ్లాక్, బ్రౌన్ కలర్ కాంబినేషన్‌తో ఎంతో విలాసవంతంగా ఉంటుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కోసం ఈ కారులో ఏకంగా 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరాతో పాటు ప్రమాదాలను ముందుగానే గుర్తించి ఆపే ‘లెవెల్ 2 ఏడీఏఎస్’ సాంకేతికతను కూడా అందించారు.

Toyota Ebella
Toyota
Ebella
Electric SUV
Electric Car
Urban Cruiser Ebella
Maruti Suzuki e-Vitara
Hyundai Creta Electric
MG ZS EV
Tata Curvv EV

More Telugu News