త్వరలో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు? ఆర్బీఐ చర్చలు..!
- భారీగా పెరిగిన పేపర్ కరెన్సీ ముద్రణ ఖర్చు
- సవాల్‌గా మారిన చిరిగిన నోట్ల నిర్మూలన
- పరిష్కారంగా ప్లాస్టిక్ నోట్లపై ఆర్బీఐ చర్చలు
- తక్కువ ఖర్చు, ఎక్కువ మన్నిక
- త్వరలోనే పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభానికి యోచన
దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ (పాలిమర్) కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నగదుకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఆర్బీఐ) ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల పట్నా, ముంబై నగరాల్లో జరిగిన బోర్డు సమావేశాల్లో ప్లాస్టిక్ నోట్లపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం వాడుతున్న కాగితపు నోట్లతో పోలిస్తే వాటి ముద్రణ ఖర్చు తక్కువగా ఉండటం, ఎక్కువ కాలం మన్నడమే ఇందుకు కారణం.
పెరిగిన ముద్రణ ఖర్చులు
గత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణ కోసం ఆర్బీఐ ఏకంగా రూ.6,372.8 కోట్లు ఖర్చు చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది చాలా పెరిగింది. కొత్తగా తీసుకురాబోయే ప్లాస్టిక్ నోట్లను సులభంగా విత్‌డ్రా చేసుకునేలా ఏటీఎం యంత్రాల్లోనూ అవసరమైన సాంకేతిక మార్పులు చేయనున్నారు. ఇందుకోసం త్వరలోనే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ నోట్లను విడుదల చేసేందుకు ఆర్బీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నా మార్కెట్లో నగదు చలామణి రికార్డు స్థాయిలో రూ.42.86 లక్షల కోట్లకు చేరింది.
చిరిగిన నోట్ల సవాల్
మార్కెట్లో పాడైపోయిన, చిరిగిపోయిన నోట్లను సేకరించి వాటిని నిర్మూలించడం ఆర్బీఐకి సవాలుగా మారింది. గత ఏడాదిలోనే సుమారు 23.8 బిలియన్ల పాత నోట్లను వెనక్కి తీసుకుంది. ఇందులో ఎక్కువగా రూ.500, రూ.100 నోట్లే ఉన్నాయి. ప్లాస్టిక్ నోట్లు వస్తే ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. గతంలో 2012లో యూపీఏ ప్రభుత్వం ఐదు నగరాల్లో రూ.10 ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా తీసుకురావాలని చూసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అప్పట్లో ఆగిపోయింది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయి సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది.