స్పోర్ట్స్‌లో ముందుండే వాడిని: ఆసక్తికర విషయాలు చెప్పిన రామ్ చరణ్

  • రాబోయే 'పెద్ది' సినిమాలో మూడు క్రీడల్లో రాణించే అథ్లెట్‌గా కనిపించనున్న చెర్రీ
  • 'పెద్ది' సినిమా షూటింగ్‌లో తన చేతికి గాయమైందని వెల్లడి
  • రెండున్నరేళ్ల విరామం తర్వాత మరింత ఆత్మవిశ్వాసంతో వస్తున్నానన్న హీరో
  • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' జూన్ 4న విడుదల
మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్ చరణ్ తన వ్యక్తిగత, సినీ విశేషాలను పంచుకున్నారు. చదువులో తాను ఎప్పుడూ గొప్పవాడిని కానని, కానీ క్రీడల్లో మాత్రం ఎప్పుడూ ముందుండేవాడినని సరదాగా వ్యాఖ్యానించారు. తన రాబోయే చిత్రం 'పెద్ది' ప్రమోషన్లలో భాగంగా ఐఏఎన్ఎస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

"నేను స్పోర్ట్స్‌ను ఎంతగానో ప్రేమించేవాడిని. వాలీబాల్, బాస్కెట్‌బాల్ జట్లకు కెప్టెన్‌గా ఉండేవాడిని. క్రికెట్ ఆడేవాడిని, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలోనూ పాల్గొనేవాడిని. చదువులో నా గ్రేడ్స్ అంత గొప్పగా ఉండేవి కావు. కాబట్టి కనీసం ఒక్క దాంట్లోనైనా రాణించాలి కదా?" అంటూ చరణ్ నవ్వేశారు.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అని, ఇందులో తన పాత్ర క్రికెట్, రెజ్లింగ్, స్ప్రింటింగ్ వంటి మూడు క్రీడల్లో రాణించే 'క్రాస్‌ఓవర్ అథ్లెట్'గా ఉంటుందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక సన్నివేశం చిత్రీకరిస్తుండగా తన చేతికి గాయమైందని వెల్లడించారు.

సుమారు రెండున్నరేళ్ల విరామం తర్వాత 'పెద్ది' చిత్రంతో వస్తున్నానని, మరింత బలంగా, గొప్పగా, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు నటిటించారు. ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ram Charan
Peddi Movie
Ram Charan Interview
Sports Action Drama
Janhvi Kapoor
Buchi Babu Sana
Telugu Cinema
Tollywood
Cross Over Athlete
శివ రాజ్‌కుమార్

More Telugu News