ఏపీలో మరో ప్రైవేటు బస్సు బోల్తా

  • కడప జిల్లా గోపవరం మండలంలో ప్రైవేటు బస్సు బోల్తా
  • గేదె అకస్మాత్తుగా అడ్డు రావడంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్
  • ఒక ప్రయాణికుడికి తీవ్ర గాయాలు
ఏపీలో కొంత కాలంగా వరుసగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. వరుస ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, మరెంతో మంది తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా మరో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. కడప జిల్లా గోపవరం మండలం పీపీ కుంట సరిహద్దులో బీసీవీఆర్ ట్రావెల్స్ బస్సు ఈ తెల్లవారుజామున బోల్తా పడింది. విజయవాడ నుంచి అనంతపురం జిల్లా కదిరికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ప్రమాదం వివరాల్లోకి వెళితే, బస్సు వేగంగా వెళుతున్న సమయంలో ఒక గేదె అకస్మాత్తుగా అడ్డురావడంతో... దాన్ని తప్పించబోయే ప్రయత్నాన్ని డ్రైవర్ చేశాడు. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో బస్సు బోల్తా కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. బస్సు బోల్తా కొట్టినప్పటికీ పెను ముప్పు తప్పింది. కేవలం ఒక ప్రయాణికుడి మాత్రం కాలికి తీవ్ర గాయమయింది. కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే 108 వాహనం ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AP Road Accidents
Andhra Pradesh
Bus Accident
Kadapa District
BCVR Travels
Gopavaram Mandal
PP Kunta
Vijayawada
Kadiri
Road Safety

More Telugu News