కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఆరుగురు కార్మికుల మృతి!

  • యూపీలోని హమీర్‌పూర్‌ జిల్లాలో ఘటన
  • బెట్వా నదిపై నిర్మిస్తున్న వంతెన
  • గాలివాన ధాటికి కూలిన  బ్రిడ్జి
  • మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానం
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర ప్రమాదం జరిగింది. బెట్వా నదిపై కురారాలోని మోరాకందర్ పర్సాని నుంచి నైతి గ్రామం వరకు నిర్మిస్తున్న వంతెన శ్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. తీవ్రమైన గాలివాన రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో అక్కడ పనులు జరుగుతుండటంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలను వెలికితీసి గుర్తించారు. శిథిలాల కింద మరో ముగ్గురు కార్మికులు చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Hamirpur bridge collapse
Uttar Pradesh
Betwa River
bridge collapse
Hamirpur accident
construction accident
laborers death
India news
Morakandar Parsani
Naiti village

More Telugu News