సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జీలు.. కేంద్రానికి కొలీజియం సిఫార్సు

National
Advertisement
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురి పేర్లను సిఫార్సు చేసిన కొలీజియం
  • వివిధ హైకోర్టుల నుంచి నలుగురు సీనియర్ న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పేర్ల ప్రతిపాదన
  • కేంద్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత నియామక ప్రక్రియ పూర్తి
  • కేసుల భారాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యమని వెల్లడి
Advertisement
సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్దం అయింది. సర్వోన్నత న్యాయస్థానంలో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు కొలీజియం కసరత్తు చేపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్  నేతృత్వంలోని కొలీజియం, నలుగురు సీనియర్ హైకోర్టు న్యాయమూర్తులను, ఒక సీనియర్ న్యాయవాదిని సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

ఈ జాబితాలో పంజాబ్ హరియాణా హైకోర్టు సీజే జస్టిస్ షీల్ నాగు, బాంబే హైకోర్టు సీజే జస్టిస్ శ్రీచంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ సచ్ దేవ, జమ్మూ కశ్మీర్ లడఖ్ సీజే జస్టిస్ అరుణ్ పళ్లి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వి. మోహన ఉన్నారు.

సుప్రీంకోర్టులో పేరుకుపోయిన కేసుల భారాన్ని తగ్గించి, న్యాయ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ నియామకాలు అత్యంత కీలకమని కొలీజియం తన సిఫార్సులో పేర్కొంది. కొలీజియం పంపిన ఈ జాబితాను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలించి, కేబినెట్ ఆమోదం కోసం పంపుతుంది.

కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయగానే ఈ నియామకాలు ఖరారవుతాయి. ఆ తర్వాత నూతన న్యాయమూర్తులుగా వీరు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నియామకాలతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరిగి, కార్యకలాపాలు మరింత చురుగ్గా సాగే అవకాశం ఉంది.
Advertisement

సంబంధిత వార్తలు

Supreme CourtSupreme Court JudgesCollegiumJustice Surya KantHigh Court JudgesIndian JudiciaryAppointment of JudgesJustice SystemDroupadi MurmuCentral Government

More Telugu News

'మురసు' తుపాను కల్లోలం.. ప్రకాశం జిల్లాలో హైఅలర్ట్!

02 Nov, 22:26

హైదరాబాద్ శివార్లలో అక్రమ బోర్లను టార్గెట్ చేసిన హైడ్రా

02 Nov, 22:13

గుడ్ న్యూస్.. రాప్తాడు బాలిక ఆరోగ్యంపై మంత్రి నారా లోకేశ్ అప్ డేట్

02 Nov, 22:05

అమిత్ షాతో భేటీపై సోషల్ మీడియాలో స్పందించిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 21:52

ఆరేళ్లలో అతిపెద్ద జంప్.. మళ్లీ భారత నెం.1 కుబేరుడిగా ముకేశ్ అంబానీ

02 Nov, 21:39

మనకు ఇష్టమైన గోరింక పిట్ట ఆస్ట్రేలియన్లకు ఎందుకు నచ్చదు?

02 Nov, 21:19

హైదరాబాద్‌లో అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 20:59

'అర్నబ్' తుపానుతో పోలిస్తే 'మురసు' తీవ్రత తక్కువే.. అయినా అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

02 Nov, 20:47

తుపాను ప్రభావిత ఏపీకి కర్ణాటక సాయం.. రంగంలోకి 500 మంది సిబ్బంది

02 Nov, 20:35

'రుద్రవనం పీఎస్' (జీ 5) సిరీస్ రివ్యూ!

02 Nov, 20:15

ఏపీ పుర పోరు: ముగిసిన రీపోలింగ్.. రేపు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

02 Nov, 20:08

'ఓ మైసా రే'.. రష్మిక 'మైసా' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

02 Nov, 19:52

కుల్దీప్ ను సిరీస్ మొత్తం పక్కనబెట్టడం ఆశ్చర్యంగా ఉంది: వెంకటపతిరాజు

02 Nov, 19:37

దేశంలో పెరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటున్న పైలట్ల సమాఖ్య

02 Nov, 19:24

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌: భారత-ఏ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. జట్టులో హేమాహేమీలకు చోటు!

02 Nov, 19:01
..More Telugu News