కాసేపు అదృశ్యమైన హార్దిక్ పాండ్యా ఇన్‌స్టా ఖాతా
- ప్రొఫైల్ కోసం వెతికితే 'యూజర్ నాట్ ఫౌండ్' అనే సందేశం
- 'ఈ ప్రొఫైల్ ప్రైవేట్', 'సమ్‌థింగ్ వెంట్ రాంగ్' అంటూ మెసేజ్
- చర్చనీయాంశంగా మారిన పాండ్యా ఇన్‌స్టా ఖాతా అదృశ్యం
భారత ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా ఇన్స్టాగ్రామ్ ఖాతా ఈరోజు కొద్దిసేపు అదృశ్యమై, కొన్ని గంటల తర్వాత తిరిగి ప్రత్యక్షమవడంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. పాండ్యా ప్రొఫైల్ కోసం వెతికినప్పుడు మొదటగా 'యూజర్ నాట్ ఫౌండ్' అనే సందేశం కనిపించింది, అంతేకాకుండా ఆ ఖాతాలో పోస్టులు గానీ, ప్రొఫైల్ చిత్రం గానీ లేవు. మరికొంతమంది వినియోగదారులకు 'ఈ ప్రొఫైల్ ప్రైవేట్', 'సమ్‌థింగ్ వెంట్ రాంగ్' వంటి మెసేజ్ కనిపించింది.
దీంతో, పాండ్యా తన ఖాతాను తొలగించాడా లేదా తాత్కాలికంగా ఆపివేశాడా అనే దానిపై సామాజిక మాధ్యమంలో చర్చ జరిగింది. చివరికి ఆ ఖాతా పునరుద్ధరించబడినప్పటికీ, ఈ ఆకస్మిక అదృశ్యంపై పాండ్యా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పాండ్యా సోషల్ మీడియా ఖాతా చర్చనీయాంశం కావడం ఇదే మొదటిసారి కాదు. మే 11వ తేదీన అతడి సోషల్ మీడియా యాక్టివిటీ దుమారం రేపింది.
పాండ్యా ముంబై ఇండియన్స్‌కు సంబంధించిన కొన్ని పోస్టులను తొలగించాడని, జట్టును అన్-ఫాలో చేశాడని ప్రచారం జరిగింది. కానీ కాసేపటికి అంతా సద్దుమణిగింది. దీంతో అదంతా సోషల్ మీడియాలో ఎర్రర్ కారణంగా అలా జరిగిందని భావించారు. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితి ఎదురు కావడం గమనార్హం. ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేసింది. కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేదు. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.