భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో ఈ 5 దేశాల్లో హ్యాపీగా డ్రైవ్ చేయవచ్చు!

Indian Driving License Valid in These 5 Countries
  • భూటాన్‌లో వాహన పత్రాల నమోదుతో ఏడాది పాటు అనుమతి
  • కెనడాలోని ఒంటారియోలో 3 నెలల పాటు చెల్లుబాటు
  • స్విట్జర్లాండ్‌లో ఏడాది పాటు లైసెన్స్ గుర్తింపు
  • ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉంటే ఉత్తమం
విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ సొంతంగా కారు లేదా బైక్ నడుపుకుంటూ రోడ్ ట్రిప్ చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే చాలామంది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే విదేశాల్లో డ్రైవ్ చేయగలమని అనుకుంటారు. కానీ మన ‘భారతీయ డ్రైవింగ్ లైసెన్స్’తోనే కొన్ని దేశాల్లో హ్యాపీగా వాహనాలు నడపొచ్చనే విషయం తెలుసా?

భూటాన్
భారతదేశానికి పొరుగున ఉన్న అందమైన పర్వతాల దేశం భూటాన్. భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు.. ఇక్కడి ఘాట్ రోడ్లపై హ్యాపీగా ప్రయాణించొచ్చు. సొంత వాహనంతో ఇక్కడ దాదాపు ఒక సంవత్సరం పాటు డ్రైవ్ చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే వాహన పత్రాలు, రిజిస్ట్రేషన్‌ను అక్కడి ‘చెక్ పోస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం దాదాపు రూ. 4,490 చెల్లించాలి.

స్విట్జర్లాండ్
మంచు కొండల స్వర్గం స్విట్జర్లాండ్‌లో కూడా మన భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌కు గుర్తింపు ఉంది. లైసెన్స్ ఇంగ్లీషులో ఉంటే చాలు.. దాన్ని చూపించి అక్కడ కారును అద్దెకు తీసుకోవచ్చు. ఒక సంవత్సరం పాటు వాహనాలను నడిపేందుకు అనుమతి ఇస్తారు. 

కెనడా
భారతీయులు ఎక్కువగా ఇష్టపడే దేశాల్లో కెనడా ఒకటి. ఇక్కడి సుదీర్ఘమైన హైవేలపై రోడ్ ట్రిప్స్ చేయడానికి భారతీయ లైసెన్స్ సరిపోతుంది. అయితే దీని కాలపరిమితి మీరు ఉండే ప్రావిన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒంటారియో ప్రావిన్స్‌లో ఉంటే మూడు నెలల కంటే తక్కువ కాలానికి ఎలాంటి అదనపు పత్రాలు లేకుండా భారతీయ లైసెన్స్‌తోనే డ్రైవ్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ కాలం ఉండాలనుకుంటే మాత్రం ‘ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్’ (ఐడీపీ) అవసరమవుతుంది.

ఆస్ట్రేలియా
భారతీయులు రోడ్ ట్రిప్స్ చేయడానికి ఇష్టపడే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. ఇంగ్లీషులో ఉన్న చెల్లుబాటు అయ్యే భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు. ఇక్కడి రోడ్లపై హ్యాపీగా ప్రయాణించొచ్చు. న్యూ సౌత్ వేల్స్, క్వీన్స్‌లాండ్, సౌత్ ఆస్ట్రేలియా, కాపిటల్ టెరిటరీ వంటి ప్రాంతాల్లో భారతీయ లైసెన్స్‌తో డ్రైవింగ్ చేయడానికి అనుమతి ఇస్తారు. అయితే నార్తర్న్ ఆస్ట్రేలియా వంటి కొన్ని ప్రాంతాల్లో కేవలం 3 నెలలు మాత్రమే అనుమతి ఉంటుంది. భారత్‌లో మాదిరే ఆస్ట్రేలియాలో కూడా రోడ్డుకు ఎడమ వైపున డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. 

ఫిన్‌లాండ్
దట్టమైన అడవులు, అందమైన సరస్సులకు కేరాఫ్ అడ్రస్ అయిన ఫిన్‌లాండ్‌లోనూ భారతీయ లైసెన్స్‌తో డ్రైవ్ చేయొచ్చు. అయితే ఇక్కడ వాహనం నడపాలంటే లైసెన్స్‌కు సంబంధించిన లీగల్ ట్రాన్స్‌లేషన్ లేదా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ వెంట ఉండటం తప్పనిసరి.

ఐడీపీ ఉంటే ఉత్తమం
విదేశాల్లో భారతీయ లైసెన్స్‌ను అనుమతించినప్పటికీ ముందు జాగ్రత్త కోసం వెంట ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉంచుకోవడం మంచిది. దీనికోసం మీరు మీ సమీపంలోని ఆర్‌టీఓ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చు. వారం రోజుల్లోనే ఇది లభిస్తుంది. జారీ చేసిన తేదీ నుంచి సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది.
Go Back to Shorts
Driving License
Indian Driving License
Bhutan
Switzerland
Canada
Australia
Finland
International Driving Permit

More Telugu News