ఓటీటీలో మరాఠీ మిస్టరీ థ్రిల్లర్!

Salbardi Movie Update
  • మరాఠీలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్
  • ఏప్రిల్ 17న విడుదలైన సినిమా 
  • ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
  • కన్నడలో మాత్రమే అందుబాటులో ఉన్న కంటెంట్

మరాఠీలో రూపొందిన ఒక మిస్టరీ థిల్లర్ ఇప్పడు ఓటీటీకి వచ్చేసింది. ఆ సినిమా పేరే 'సల్బర్ది'. పూజ సావంత్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, రమేశ్ చౌదరి దర్శకత్వం వహించాడు. రామ్ జాదవ్ - గజానన్ జాదవ్ నిర్మించిన ఈ సినిమాను, ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమాను 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ కి తీసుకుని వచ్చారు. అయితే మరాఠీలో మాత్రమే అందుబాటులో ఉంది.

అది ఆధునిక ప్రపంచానికి చాలా దూరంగా ఉండే ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామానికి చెందిన పదేళ్ల పిల్లలు అదృశ్యమవుతూ ఉంటారు. అలా కనిపించకుండా పోయిన పిల్లలు, ఆ తరువాత శవాలుగా దొరుకుతూ ఉంటారు. దాంతో చీకటిపడితే తమ పిల్లలను బయటికి పంపించడానికి తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. అందరూ కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉంటారు.

ఈ నేపథ్యంలో ఈ కేసును పరిష్కరించడం కోసం స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా 'మనోరమ' అక్కడికి వస్తుంది. తనదైన స్టైల్లో అన్ని కోణాలలో సమస్య మూలలను పరిశీలిస్తూ ముందుకు వెళుతుంది. అప్పుడు ఆమెకి తెలిసే నిజాలేమిటి? పిల్లల మరణాలకు కారకులు ఎవరు? వాళ్లు అలా చేయడంలోని ఉద్దేశం ఏమిటి? అనేది కథ.

Advertisement
Pooja Sawant
Salbard
Marathi movie
Mystery thriller
Amazon Prime
Ramesh Choudhary
Ram Jadhav
Gajanan Jadhav
Salbard movie review
Marathi cinema

More Telugu News