అందుకే విజయ్‌తో వెళ్లాల్సి వచ్చింది.. డీఎంకేకు కాంగ్రెస్‌ కౌంటర్‌

Udhayanidhi Stalin Congress face off over alliance break up
  • కాంగ్రెస్‌ను ఇంకెప్పుడూ నమ్మబోమని ఉదయనిధి వ్యాఖ్యలు
  • ఉదయనిధి విమర్శలను తప్పుబట్టిన మాణికం ఠాగూర్
  • మైనారిటీలో ఉన్నప్పుడు మద్దతిచ్చామన్న కాంగ్రెస్‌ ఎంపీ
  • బీజేపీని అడ్డుకోవడం కోసమే విజయ్‌తో కలిశామని వివరణ
నిన్నటివరకు కలిసి నడిచిన మిత్రులు.. నేడు రాజకీయ శత్రువులుగా మారారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే, కాంగ్రెస్ మధ్య మొదలైన విభేదాలు ఇప్పుడు తారస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఘాటు విమర్శలతో దక్షిణాది రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

డీఎంకే వ్యాఖ్యలు ఒప్పుకోం
కాంగ్రెస్‌ను ఇకపై ఎప్పటికీ నమ్మబోమంటూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కష్టకాలంలో డీఎంకేకు అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీనే అని ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు. డీఎంకే మైనారిటీలో ఉన్నప్పుడు తాము బయటి నుంచి మద్దతు ఇచ్చామని, ఉదయనిధి మాట్లాడిన మాటలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని మండిపడ్డారు.

విజయ్‌తో వెళ్లడానికి కారణం
తమిళనాడులో బీజేపీ కాలు మోపకుండా అడ్డుకోవడమే కాంగ్రెస్ ఉద్దేశమని మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు. అందుకోసమే గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన నటుడు విజయ్‌కు చెందిన టీవీకే పార్టీతో కూటమి కట్టామని చెప్పారు. డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు లోపాయికారీగా బీజేపీతో సంబంధాలు పెట్టుకుంటున్నాయనే అనుమానంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఉదయనిధి ఏమన్నారు?
దీనికి ముందు ఉదయనిధి స్టాలిన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలకు కనీస కృతజ్ఞత, సంస్కారం లేవని ధ్వజమెత్తారు. డీఎంకే కేడర్ శ్రమ వల్లే కాంగ్రెస్ ఐదు సీట్లు గెలుచుకుందని అన్నారు. కానీ నేడు కొన్ని పదవుల కోసం తమకు చెప్పకుండా విజయ్‌వైపు పారిపోయారని, అలాంటి వారిని ఇకపై తమ దరిచేరనివ్వబోమని పేర్కొన్నారు. 
Go Back to Shorts
Udhayanidhi Stalin
DMK
Congress
TVK
Vijay TVK
Tamil Nadu politics
Manickam Tagore
Tamil Nadu elections
BJP
political alliance

More Telugu News