సోషల్ మీడియాలో చైనా యువతి సంచలనం.. 24 గంటల్లో కోటి మంది ఫాలోవర్లు!

  • మూడేళ్ల విరామం తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చిన చైనా బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్
  • తిరిగి వచ్చిన 24 గంటల్లోనే కోటి మంది ఫాలోవర్లను సంపాదించి రికార్డ్
  • పాత ఏజెన్సీతో ట్రేడ్‌మార్క్ వివాదం కారణంగా సోషల్ మీడియాకు దూరం
సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ, చైనాకు చెందిన ఓ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, సంచలనం సృష్టించింది. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సోషల్ మీడియాలోకి తిరిగి అడుగుపెట్టి, కేవలం 24 గంటల్లోనే కోటి మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకుని రికార్డు సృష్టించింది. ఈ ఫీట్, 2024లో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్‌లో నెలకొల్పిన రికార్డును గుర్తుచేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. జియాంగ్ చెంగ్లాన్ అనే చైనా బ్యూటీ, మేకప్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు 'డౌయిన్' అనే వీడియో షేరింగ్ యాప్‌లో గతంలో సుమారు 3 కోట్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. అయితే, 2023 మే నెల నుంచి ఆమె సోషల్ మీడియాలో కనిపించడం మానేశారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, ఆమె మాజీ ఏజెన్సీ 'షాంఘై జిన్ జియా కంపెనీ'తో తలెత్తిన వివాదాల కారణంగానే ఆమె సోషల్ మీడియాకు దూరమయ్యారు. ఆమె పాత ఆన్‌లైన్ పేరు 'చెంగ్షియాన్'ను ఆ ఏజెన్సీ ట్రేడ్‌మార్క్‌ గా నమోదు చేసుకోవడంతో, ఆమె ఆ పేరును ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడింది.

దీంతో, మే 13న తన అసలు పేరుతోనే కొత్త అకౌంట్ తెరిచి రీఎంట్రీ ఇచ్చింది. ఆమెను మర్చిపోని అభిమానులు ఒక్క రోజులోనే కోటి మంది ఆమెను ఫాలో అవడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "నా పాత అకౌంట్‌తో, దానికి అనుబంధంగా ఉన్న షాపులతో నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి నాపై నమ్మకంతో అక్కడి నుంచి ఏమీ కొనుగోలు చేయవద్దు" అని తన ఫాలోవర్లను హెచ్చరించింది. మూడేళ్లయినా తన ఫాలోవర్లు చూపించిన అభిమానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
 
Go Back to Shorts
Jiang Chenglan
China influencer
Douyin
social media
beauty influencer
makeup influencer
Chinese social media
Shanghai Jin Xia Company
Cristiano Ronaldo
trending

More Telugu News