భవిష్యత్తులో వ్యాపార అవకాశాల్లో సీఏల పాత్ర కీలకం: కేటీఆర్

  • ఐసీఏఐ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్
  • చార్టర్డ్ అకౌంటెంట్లు కేవలం పన్నుల లెక్కలకే పరిమితం కాకూడదని సూచన
  • సీఏలు వ్యాపారాలను వృద్ధి చేసే సలహాదారులుగా ఎదగాలని ఆకాంక్ష
భవిష్యత్తులో వ్యాపార అవకాశాల్లో చార్టర్డ్ అకౌంటెంట్ల (సీఏ) పాత్ర అత్యంత కీలకంగా మారుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గచ్చిబౌలిలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేటీఆర్ మాట్లాడుతూ, చార్టర్డ్ అకౌంటెంట్లు కేవలం పన్నుల లెక్కలకే పరిమితం కాకూడదని సూచించారు.

సీఏలు వ్యాపారాలను వృద్ధి చేసే సలహాదారులుగా ఎదగాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుత కాలానుగుణంగా కృత్రిమ మేధ (ఏఐ)ని వృత్తిలో భాగంగా చేసుకోవాలని ఆయన అన్నారు. మున్ముందు పన్నులు, జీఎస్టీ, వ్యాపారాల విస్తరణలో సీఏల అవసరం చాలా ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల త్యాగాలను, కష్టాన్ని మరవకూడదని సూచించారు.

KTR
KTR Telangana
Chartered Accountants
ICAI
Business Opportunities
GST
Artificial Intelligence

More Telugu News