హెడ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వని కోహ్లీ.. మైదానంలో మాటల యుద్ధం.. ఆ తర్వాత అవమానం!
- ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో కోహ్లీ, హెడ్ మధ్య వాగ్వాదం
- మ్యాచ్ అనంతరం హెడ్ ఇచ్చిన షేక్ హ్యాండ్‌ను పట్టించుకోని కోహ్లీ
- ఉద్దేశపూర్వకంగా హెడ్‌ను దాటి ముందుకెళ్లిన విరాట్
- మ్యాచ్ ఓడినా సన్‌రైజర్స్‌ను వెనక్కినెట్టి టేబుల్ టాపర్‌గా నిలిచిన ఆర్‌సీబీ
శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా, ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అతడిని చూసీచూడనట్టు ముందుకు వెళ్లిపోయాడు. వీరిద్దరి మధ్య మ్యాచ్ సమయంలో జరిగిన వాగ్వాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో ఈ వివాదం మొదలైంది. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హెడ్‌తో వాగ్వాదానికి దిగాడు. కోహ్లీ సీరియస్‌గా మాట్లాడుతుండగా, హెడ్ మాత్రం నవ్వుతూ కనిపించాడు. వీరి మధ్య మాటల యుద్ధం ఎందుకు మొదలైందో స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే కోహ్లీ 11 పరుగులకే ఔటయ్యాడు. అనంతరం ఆర్‌సీబీ 55 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
అయితే, ఈ ఓటమి తర్వాత కూడా ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్‌ను వెనక్కి నెట్టి ఐపీఎల్ 2026 లీగ్ దశలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు అభినందించుకుంటూ లైన్‌లో వస్తుండగా, హెడ్ కరచాలనం కోసం చేయి అందించాడు. అయితే, కోహ్లీ అతడికి ముందున్న ఆటగాడితో, తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్‌తో షేక్ హ్యాండ్ ఇచ్చి, హెడ్‌ను మాత్రం ఉద్దేశపూర్వకంగా పట్టించుకోకుండా దాటి వెళ్లాడు. దీంతో హెడ్ ఆశ్చర్యంగా కోహ్లీ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.