ఉమర్ ఖాలిద్‌కు మధ్యంతర బెయిల్
- 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టైన ఉమర్ ఖాలిద్
- జూన్ 1 నుంచి మూడు రోజుల పాటు మధ్యంతర బెయిల్
- శస్త్ర చికిత్స చేయించుకోనున్న తల్లిని చూసేందుకు బెయిల్
2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టైన ఉమర్ ఖాలిద్‌కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మూడు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శస్త్రచికిత్స చేయించుకోనున్న తన తల్లిని పరామర్శించడానికి వీలుగా, జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు అతడికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఖాలిద్ గత ఆరేళ్లుగా జైలు జీవితం గడుపుతున్నాడు. తన మామగారి కర్మకాండలకు హాజరయ్యేందుకు, అలాగే శస్త్రచికిత్స చేయించుకోనున్న తన తల్లిని కలిసేందుకు 15 రోజుల మధ్యంతర బెయిల్ కోరుతూ తొలుత ట్రయల్ కోర్టును ఆశ్రయించాడు.
అతడి అభ్యర్థనను ట్రయల్ కోర్టు తిరస్కరించడంతో హైకోర్టు గడప తొక్కాడు. అతడి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఖలిద్‌కు మూడు రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ సమయంలో అతడు ఇంట్లోనే ఉండాలని, ఆసుపత్రిలో ఉన్న తన తల్లిని కలవాలి తప్ప ఇతర ప్రదేశాలకు వెళ్లకూడదని షరతు విధించింది. లక్ష పూచీకత్తు చెల్లించాలని అతడికి తెలిపింది. అతడి కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టాలని పోలీసులకు ఆదేశించింది.