బండి భగీరథ్ అరెస్టు విషయంలో రేవంత్ రెడ్డి అలా, బండి సంజయ్ ఇలా: కేటీఆర్ విమర్శలు

  • బండి సంజయ్ లొంగుబాటు అంటే, రేవంత్ రెడ్డి అరెస్టు అంటున్నారని ఆగ్రహం
  • ఇద్దరు తోడు దొంగలు కలిసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శ
  • రేవంత్ రెడ్డికి హైట్ మాత్రమే తక్కువ కాదు బుర్ర కూడా తక్కువ అని ఎద్దేవా
బండి భగీరథ్ లొంగిపోయాడని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ చెబితే, పోలీసులే అరెస్టు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన లొంగుబాటు అంటే, ఈయన అరెస్టు అని చెప్పడం విడ్డూరమని అన్నారు. ఇద్దరు తోడు దొంగలని, వారు కలిసి డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి హైట్ ఒక్కటే తక్కువ అనుకున్నానని, కానీ బుర్ర కూడా తక్కువేనని ఎద్దేవా చేశారు.

బండి భగీరథ్‌కు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారని, కానీ హైకోర్టులో అనుకూలంగా తీర్పు రాలేదని కేటీఆర్ తెలిపారు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి వివరాలు బయటపెట్టింది బీజేపీవారే అన్నారు. పేట్ బషీరాబాద్‌లో 15 మందిపై కేసులు నమోదయ్యాయని, వారంతా బీజేపీవారే అన్నారు.

ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు వచ్చి చావు కబురు చల్లగా చెప్పారని విమర్శించారు. రైతులు యూరియా ఉపయోగించడం తక్కువ చేయాలని, ప్రజలు బంగారం కొనుగోలు తగ్గించాలని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం వచ్చే సీజన్‌లో కూడా రైతులకు ఇబ్బంది తప్పదని అన్నారు. రాష్ట్రంలో గన్నీ బ్యాగులు దొరకడం లేదు కానీ గన్‌లు మాత్రం బాగా దొరుకుతున్నాయని కేటీఆర్ విమర్శించారు.

KTR
K Taraka Rama Rao
Revanth Reddy
Bandi Sanjay
Bandi Bhagirath
Telangana politics
BRS party

More Telugu News