భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు పాకిన ‘బొద్దింక’!

Cockroach Party Trend Spreads from India to Pakistan
  • పాక్‌లో కాక్రోచ్‌ అవామీ పార్టీల ఆవిర్భావం
  • ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా పెరుగుతున్న ఫాలోవర్లు
  • నిరుద్యోగ యువత గొంతుకగా మారిన బొద్దింక
  • విద్య, ఉపాధి సమస్యలపై డిజిటల్ పోరాటం
  • భారత్ స్ఫూర్తితోనే పుట్టాయని పాక్ గ్రూపుల వెల్లడి
భారత్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ డిజిటల్ ట్రెండ్ ఇప్పుడు పాకిస్థాన్‌కూ పాకింది. అక్కడ కూడా ‘కాక్రోచ్‌ అవామీ పార్టీ’, ‘కాక్రోచ్‌ అవామీ లీగ్’ వంటి కొత్త గ్రూపులు సోషల్ మీడియాలో పుట్టుకొచ్చాయి. నిరుద్యోగ యువత వేదికగా సాగుతున్న ఈ పొలిటికల్ ట్రెండ్ ఇరు దేశాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. పాక్‌లో ప్రధాన రాజకీయ పార్టీలైన ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ, నవాజ్ షరీఫ్ పీఎంఎల్-ఎన్, పీపీపీలకు ప్రత్యామ్నాయంగా ఈ ‘కాక్రోచ్‌ పార్టీలు’ రంగంలోకి దిగుతున్నాయి.

‘కాక్రోచ్‌ అవామీ పార్టీ’ తమ ఇన్‌స్టా బయోలో ‘‘అవును కాపీ కొట్టాం, కానీ ఎవరికి నష్టం? మా మోటో ఒక్కటే’’ అంటూ భారత్ నుంచి స్ఫూర్తి పొందినట్లు బాహాటంగానే అంగీకరించింది. ఈ అకౌంట్లు పూర్తిగా పాక్ నిరుద్యోగ జనరేషన్-జెడ్ యువత గొంతుకగా మారుతామని ప్రకటిస్తున్నాయి.

‘‘వ్యవస్థ ఎవరినైతే బొద్దింకలుగా భావించిందో.. మేం ఆ ప్రజల గొంతుకలం’’ అంటూ ‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడతాం’ అనే ఉర్దూ నినాదంతో పాక్ యువత సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది. నిరుద్యోగం, దేశ పాలన, రాజకీయ వ్యవస్థలపై తమకున్న అసంతృప్తికి ఈ బొద్దింక గుర్తును వాడుకుంటూ మీమ్స్ రూపంలో అక్కడి ప్రభుత్వాలపై నిరసనగా వ్యక్తం చేస్తోంది.
Go Back to Shorts
Cockroach Party
Pakistan
India
social media
unemployment
Imran Khan
Nawaz Sharif
political parties
Gen Z

More Telugu News