దర్శకుడు మెహర్ రమేష్ కు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం... డైరెక్టర్ల బోర్డులో సుమన్, శివాజీ

Mehar Ramesh Appointed as Vice Chairman of AP Film Development Corporation
  • ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పి. భరత్ భూషణ్ నియామకం
  • వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్
  • వీరితో పాటు 14 మంది డైరెక్టర్లతో నూతన పాలకమండలి ఏర్పాటు
  • గురువారం నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థకు (APSFTVTDC) రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలకమండలిని నియమించింది. సంస్థ ఛైర్మన్‌గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ పంపిణీదారుడు పి. భరత్ భూషణ్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, వైస్ ఛైర్మన్‌గా ప్రముఖ సినీ దర్శకుడు చిక్కాల మెహర్ రమేష్ కుమార్ (మెహర్ రమేష్) నియమితులయ్యారు.

గత రెండేళ్లుగా ఖాళీగా ఉన్న ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని భర్తీ చేయడంతో పాటు, 14 మందిని డైరెక్టర్లుగా నియమించారు. ఈ నియామకాలతో సంస్థ కార్యకలాపాలకు కొత్త ఉత్తేజం వచ్చినట్లయింది.

ఇక, బోర్డు డైరక్టర్లుగా నియమితులైన వారిలో ప్రముఖ సినీ రచయి బుర్రా సాయి మాధవ్, చిలకలూరిపేటకు చెందిన రిటైర్డ్ అధ్యాపకులు, రచయిత డాక్టర్ కందిమళ్ల సాంబశివరావులు ఉన్నారు. నటుల విభాగంలో సీనియర్ నటుడు సుమన్, శివాజీ, నటి ఝాన్సీలను డైరెక్టర్లుగా ఎంపిక చేశారు.

దర్శకుల్లో ఎస్.వి. కృష్ణారెడ్డి, వి. సముద్రలకు ఈ జాబితాలో చోటు దక్కింది. అలాగే, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, కూచిభోట్ల వివేకానంద కూడా డైరెక్టర్లుగా నియమితులయ్యారు. వీరితో పాటు సీనియర్ జర్నలిస్ట్ కె. ఉమా మహేశ్వరరావు, మీర్ ఎస్., ఎ. సత్యనారాయణ, జి. రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణలను కూడా డైరెక్టర్ల బృందంలోకి తీసుకున్నారు. ఈ నియామకాల ద్వారా వివిధ రంగాల అనుభవజ్ఞులకు అవకాశం కల్పించినట్లయింది.
Go Back to Shorts
Mehar Ramesh
AP Film Development Corporation
Andhra Pradesh
Telugu Film Chamber
Bharath Bhushan
Suman
Sivaji
Burra Sai Madhav
Chadalavada Srinivasa Rao
Vivek Kuchibhotla

More Telugu News