చిరంజీవి గొప్ప మనసు.. ఎప్‌సెట్ టాపర్‌ను సత్కరించిన మెగాస్టార్
- ఎప్‌సెట్ స్టేట్ టాపర్ రుషిని సత్కరించిన మెగాస్టార్
- ఫస్ట్ ర్యాంక్ వస్తే చిరంజీవిని కల్పిస్తానని తండ్రి ప్రామిస్
- 1986 తర్వాత ఇంజినీరింగ్‌లో టాపర్‌గా నిలిచిన తొలి అమ్మాయి
- రుషి సాధించిన ఘనతకు చిరంజీవి ప్రశంసలు
- ఐఏఎస్ కలకు మద్దతు ఇస్తానని హామీ
‘‘నువ్వు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో.. నిన్ను మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లి ఆశీర్వాదం ఇప్పిస్తా’’ అని ఒక తండ్రి తన కూతురికి ప్రామిస్ చేశారు. పట్టుదలతో కష్టపడి చదివిన ఆ అమ్మాయి తెలంగాణ ఎప్‌సెట్‌లో స్టేట్ టాపర్‌గా నిలిచింది. తాజాగా ఆ ‘మెగా’ కల కూడా నిజమైంది.
తండ్రి మాట కోసం
తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాల్లో సంచలనం సృష్టించిన ఎం.రుషి వెనక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. రుషి తండ్రి చిన్నప్పటి నుంచి చిరంజీవికి పెద్ద అభిమాని. రుషికి కూడా మెగాస్టార్ అంటే చాలా ఇష్టం. దీంతో ఎప్‌సెట్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే స్వయంగా ఆయన దగ్గరకు తీసుకెళ్లి కల్పిస్తానని తండ్రి మాటిచ్చారు. కష్టపడి చదివిన రుషి స్టేట్ టాపర్‌గా నిలిచింది.
40 ఏళ్ల రికార్డు బద్దలు
రుషి సాధించిన ఈ విజయం సాధారణమైనది కాదు. ఇంజినీరింగ్ విభాగంలో గత 40 ఏళ్లుగా (1986 తర్వాత) స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక అమ్మాయిగా రుషి రికార్డు సృష్టించింది. మగపిల్లలదే హవా అనుకునే ఈ విభాగంలో ఓ అమ్మాయి టాపర్‌గా నిలవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
మెగాస్టార్ ఘన సత్కారం
తనను కలవడానికి వచ్చిన ఈ యంగ్ అచీవర్కు మెగాస్టార్ చిరంజీవి ఘన స్వాగతం పలికారు. రుషి సాధించిన అద్భుతమైన విజయాన్ని అభినందిస్తూ ఆమెను శాలువాతో సత్కరించారు. ల్యాప్‌టాప్ బహుమానంగా ఇచ్చారు. ఇంత చిన్న వయసులోనే తండ్రి మాట కోసం అంతటి కఠినమైన పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడం గొప్ప విషయమని కొనియాడారు.
ఐఏఎస్ సంకల్పానికి మద్దతు
ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ రాసి ఐఏఎస్ అధికారిణి కావాలన్నదే తన లక్ష్యమని రుషి చిరంజీవికి వివరించింది. ఆమె సంకల్పాన్ని విన్న మెగాస్టార్ ఎంతో సంతోషించారు. రుషి చదువును ఆపొద్దని.. తన నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా మొహమాటం లేకుండా అడగాలని భరోసా ఇచ్చారు.