సల్మాన్ ఖాన్ ఇంట్లో ఐదడుగుల భారీ పాము.. తీవ్ర కలకలం!
- బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంట్లో ఐదడుగుల పొడవైన పాము కలకలం
- సమాచారంతో స్నేక్ క్యాచర్ వచ్చి దానిని సురక్షితంగా పట్టుకున్న వైనం
- అది విషరహితమైన 'ధమిన్' జాతి పాము అని వెల్లడి
- తన 'ఒంటరితనం' పోస్ట్‌పై సల్లూభాయ్ వివరణ
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివాసంలో ఓ భారీ పాము కలకలం సృష్టించింది. ముంబైలోని ఆయన విలాసవంతమైన గెలాక్సీ అపార్ట్మెంట్లో సుమారు ఐదు అడుగుల పొడవైన 'ధమిన్' జాతి పాము ప్రత్యక్షమైంది. ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
విధుల్లో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్, పాములను పట్టడంలో నిపుణుడైన విక్కీ దూబేకు ఈ విషయం తెలియజేశారు. దాంతో హుటాహుటిన సల్మాన్ నివాసానికి చేరుకున్న విక్కీ.. అత్యంత చాకచక్యంగా ఆ పామును పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై బాంద్రా వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, అటవీ శాఖ కంట్రోల్ రూమ్‌కు కూడా సమాచారం ఇచ్చారు. సాధారణంగా 'ఇండియన్ ర్యాట్ స్నేక్' అని పిలిచే ఈ 'ధమిన్' జాతి పాముకు విషం ఉండదని, ఇవి ఎలుకలు, కప్పలు, బల్లుల వంటి చిన్న జీవులను తింటాయని నిపుణులు వివరించారు.
ఒంటరితనం పోస్ట్‌పై సల్లూభాయ్ క్లారిటీ
ఇదిలా ఉంటే... సల్మాన్ ఖాన్ మరోవైపు సోషల్ మీడియా పోస్ట్‌తో వార్తల్లో నిలిచారు. ఇటీవల 'ఒంటరితనం' గురించి ఆయన పెట్టిన పోస్ట్‌పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేయడంతో దానిపై ఆయన తాజాగా వివరణ ఇచ్చారు. "అయ్యో, నేను నా గురించి మాట్లాడలేదు. ఇంత పెద్ద కుటుంబం, మంచి స్నేహితులు, మీలాంటి అభిమానుల ఆశీస్సులు ఉన్నప్పుడు నేను ఒంటరిని ఎలా అవుతాను? అలా భావిస్తే నేను కృతజ్ఞత లేనివాడిని అవుతాను" అని స్పష్టం చేశారు.
అయితే, కొన్నిసార్లు అందరితో ఉండి విసుగొస్తుందని, అందుకే కాస్త 'మీ టైమ్' తీసుకుంటానని పేర్కొన్నారు. "కొన్నిసార్లు జనంతో ఉండి బోర్ కొడుతుంది. అందుకే నాకంటూ కొంత సమయం కేటాయించుకుంటాను. అంతే. ఈసారి ఫొటో పెట్టలేదని బ్రేకింగ్ న్యూస్ చేసేశారు. 'ఏమైంది నాయనా?' అని అమ్మ కూడా అడుగుతోంది. ప్రశాంతంగా ఉండండి యార్" అంటూ అభిమానులను ఉద్దేశించి సరదాగా పోస్ట్ పెట్టారు. ఇక సినిమాల విషయానికొస్తే, సల్మాన్ ఖాన్ త్వరలో 'మాతృభూమి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.