ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం.. కుమార్తెను నీళ్ల ట్యాంకులో పడేసి.. మూతపెట్టి నీటితో నింపి హత్య!
- ప్రియుడితో పెళ్లికి అడ్డుగా ఉందని కూతురిని హత్య చేసిన తల్లి
- హైదరాబాద్ అల్వాల్‌లో వెలుగు చూసిన దారుణం
- పాప కనిపించడం లేదంటూ నాటకం
- సీసీటీవీ ఫుటేజ్‌తో గుట్టురట్టు
ప్రియుడి మోజులో పడి కన్న కూతురినే అత్యంత కిరాతకంగా హత్య చేసిందో తల్లి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించి, ఆరేళ్ల చిన్నారిని నీటి ట్యాంకులో పడేసి చంపేసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది.
ఓల్డ్ అల్వాల్‌కు చెందిన రేఖ (27)కు కొన్నేళ్ల క్రితం రాజు అనే వ్యక్తితో వివాహమైంది. వారికి తన్విక (6) అనే కుమార్తె ఉంది. అయితే భర్తతో విభేదాల కారణంగా విడిపోయి, తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో స్థానికంగా కిరాణా షాపులో పనిచేసే సాయి (21) అనే యువకుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
తనను పెళ్లి చేసుకోవాలని సాయిపై రేఖ ఒత్తిడి తెచ్చింది. అయితే, ఇప్పటికే కూతురు ఉన్నందున పెళ్లి చేసుకోలేనని అతడు తేల్చి చెప్పాడు. దీంతో తన పెళ్లికి కుమార్తె తన్విక అడ్డుగా ఉందని భావించిన రేఖ ఆమెను చంపాలని నిర్ణయించుకుంది.
ఈ నెల 16న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాపను ఇంటిపైకి తీసుకెళ్లి, నీటి ట్యాంకులో పడేసి మూతపెట్టింది. ఆపై ట్యాంకును నీటితో నింపింది. అనంతరం ఏమీ తెలియనట్టుగా తన కూతురు కనిపించడం లేదని కుటుంబ సభ్యులతో కలిసి నాటకమాడింది. రేఖ సోదరి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా రేఖ తన కూతురితో డాబాపైకి వెళ్లి ఒంటరిగా తిరిగి రావడం కనిపించింది. అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించింది. పోలీసులు రేఖపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రియుడు సాయి పాత్రపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.