కాళేశ్వరం అంత్య పుష్కరాలకు 3,360 బస్సులు.. ఛార్జీలు పెంచుతున్నట్లు ఆర్టీసీ వెల్లడి

  • ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి అంత్య పుష్కరాలు
  • రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు
  • ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను పెంచుతున్నట్లు రీజినల్ మేనేజర్ వెల్లడి
  • మహాలక్ష్మి ప్రయాణికులకు ఉచిత ప్రయాణం ఉంటుందన్న రీజినల్ మేనేజర్
కాళేశ్వరంలో నిర్వహించనున్న అంత్య పుష్కరాలకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 3,360 బస్సులతో 5,772 ప్రత్యేక ట్రిప్పులను నడపనున్నారు. ఈ మేరకు వరంగల్ రీజినల్ మేనేజర్ భవానీప్రసాద్ మాట్లాడుతూ, ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 1 వరకు గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమక్షేత్రమైన కాళేశ్వరంలో పుష్కరాలు జరుగుతున్నాయని, ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక రవాణా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 5,772 ట్రిప్పులు నడిపేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. రీజియన్‌లోని హన్మకొండ, వరంగల్ 1, వరంగల్ 2, పరకాల, నర్సంపేట, జనగామ, భూపాలపల్లి, తొర్రూరు, మహబూబాబాద్ డిపోల నుంచి కాళేశ్వరానికి 59 ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు. హన్మకొండ బస్టాండ్ నుంచి మరిన్ని ప్రత్యేక బస్సులు ఉంటాయని తెలిపారు.

ఈ ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయా ప్రాంతాల నుంచి నడిచే ఆర్టీసీ ప్రత్యేక బస్సులకు 50 శాతం అదనంగా వసూలు చేస్తామని అన్నారు. మహాలక్ష్మి ప్రయాణికులకు యథావిధిగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని అన్నారు.

Saraswati Anthya Pushkaralu
Kaleshwaram
Telangana RTC
Godavari River
Pranahita River
Pushkaralu charges

More Telugu News