ప్రధాని మోదీ పిలుపు.. 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్లిన సిక్కిం ముఖ్యమంత్రి

  • ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాలి నడకన వెళ్లిన సీఎం
  • కార్యక్రమం అనంతరం టాక్సీలో నివాసానికి తిరిగి వచ్చిన సీఎం
  • సమీప ప్రాంతాలకు కాలినడకన వెళుతున్న ముఖ్యమంత్రి
ఇంధనం పొదుపు చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సోమవారం ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు తన అధికారిక నివాసం నుంచి 2 కిలోమీటర్లకు పైగా నడిచారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి టాక్సీలో తన నివాసానికి తిరిగి వచ్చారు. పశ్చిమాసియాలో సంక్షోభం నెలకొన్న వేళ ఇంధన వినియోగాన్ని తగ్గించాలని దేశ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ పిలుపు మేరకు గత కొద్ది రోజులుగా ఆయన అధికారిక నివాసంలోని సమీప ప్రాంతాలకు కాలి నడకనే వెళుతుండటం గమనార్హం. ఇంధన పొదుపు కోసం రహదారులపై ప్రభుత్వ వాహనాలు శని, ఆదివారాల్లో సరి-బేసి నిబంధనలను పాటించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ నిబంధన నుంచి ప్రైవేటు వాహనాలకు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మరిన్ని ఇంధన పొదుపు చర్యలను త్వరలోనే అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

Prem Singh Tamang
Sikkim Chief Minister
Narendra Modi
Fuel Conservation
Energy Saving
Sikkim

More Telugu News