ఉస్మానియా యూనివర్సిటీ కీలక ప్రకటన.. డిగ్రీ పరీక్షల రీషెడ్యూల్
- బక్రీద్ పండుగ కారణంగా మే 28న ఓయూ పరీక్షలు రీషెడ్యూల్
- పరీక్షలను రీషెడ్యూల్ చేస్తామని స్పష్టం చేసిన వైస్ ఛాన్స్లర్
- పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వానికి ఎంపీ ఒవైసీ విజ్ఞప్తి
- త్వరలో కొత్త పరీక్షల తేదీలను ప్రకటించనున్న ఓయూ అధికారులు
- తదుపరి అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ చూడాలని సూచన
బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పండుగను పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) కీలక నిర్ణయం తీసుకుంది. మే 28వ తేదీన నిర్వహించ తలపెట్టిన పలు డిగ్రీ కోర్సుల పరీక్షలను రీషెడ్యూల్ చేయనున్నట్లు ప్రకటించింది. పండుగ తేదీపై స్పష్టత రావడంతో విద్యార్థుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
ఈ నిర్ణయానికి ఒకరోజు ముందు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు విజ్ఞప్తి చేశారు. బక్రీద్ పండుగ రోజే బీఏ, బీకాం, బీఎస్సీ వంటి పలు ముఖ్యమైన పరీక్షలను షెడ్యూల్ చేశారని, దీనివల్ల ముస్లిం విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. బీకాం 4వ, 6వ సెమిస్టర్, బీఎస్సీ ఆనర్స్, బీఎస్సీ బయోమెడికల్ సైన్స్ సహా పలు పరీక్షల జాబితాను ప్రస్తావిస్తూ, వాటిని అనువైన మరో తేదీకి మార్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఓవైసీ విజ్ఞప్తి, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగురాం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సెలవుల ప్రకారం మే 27న ఎలాంటి పరీక్షలు షెడ్యూల్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ బక్రీద్ తేదీలో మార్పు ఉంటే, దానికి అనుగుణంగా మే 28న జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూల్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పరీక్షల తేదీలకు సంబంధించిన తదుపరి అప్డేట్స్ కోసం విద్యార్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ (osmania.ac.in)ను గమనించాలని సూచించారు.
ఇస్లామిక్ క్యాలెండర్లోని చివరి నెల అయిన ధుల్-హిజ్జాకు సంబంధించిన చంద్రుడు ఆదివారం (మే 17) కనిపించకపోవడంతో ఇస్లామిక్ పండితులతో కూడిన మూన్ సైటింగ్ కమిటీ మే 19ని ధుల్-హిజ్జా మొదటి రోజుగా ప్రకటించింది. దీని ప్రకారం, ధుల్-హిజ్జా 10వ రోజైన బక్రీద్ పండుగ మే 28న వస్తుందని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా తన అధికారిక సెలవుల జాబితాను సవరించి, మే 28ని బక్రీద్ పండుగకు సెలవుగా ప్రకటించనుంది. యూనివర్సిటీ త్వరలోనే వాయిదా పడిన పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించనుంది.