తమిళనాడు సినిమాటోగ్రఫీ మంత్రిగా రాజ్ మోహన్... విజయ్ నిర్ణయాన్ని తప్బుబట్టిన విశాల్!

Vishal Criticizes Vijays Decision on Tamil Nadu Minister
  • తమిళనాడు సీఎం విజయ్ నిర్ణయంపై నటుడు విశాల్ బహిరంగ విమర్శ
  • సినిమా శాఖను అనుభవం లేని రాజ్‌మోహన్‌కు ఇవ్వడంపై అసంతృప్తి
  • ఈ శాఖను సీఎం విజయ్ స్వయంగా చూసుకోవాలని విశాల్ సూచన
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తీసుకున్న ఓ నిర్ణయంపై ప్రముఖ నటుడు విశాల్ బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన కేబినెట్‌లో సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ టెక్నాలజీ శాఖను ఎగ్మోర్ ఎమ్మెల్యే రాజ్‌మోహన్‌కు కేటాయించడాన్ని విశాల్ తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఓ పోస్ట్ చేశారు.

"సీఎం జోసెఫ్ విజయ్ మంత్రులకు శాఖలు కేటాయించడం సంతోషంగా ఉంది. కానీ, ఫిల్మ్ టెక్నాలజీ మంత్రిగా రాజ్‌మోహన్‌ను నియమించడం నిరాశపరిచింది," అని విశాల్ పేర్కొన్నారు. తమిళ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాజ్‌మోహన్‌కు పెద్దగా అనుభవం లేదని, దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్న సీఎం విజయ్ ఈ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తాను రాజ్‌మోహన్‌ను కించపరచడం లేదని, ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా విశాల్ ప్రభుత్వం ముందు మూడు ప్రధాన డిమాండ్లను ఉంచారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ తీసుకురావాలని, "ఒకే దేశం-ఒకే పన్ను" విధానం ప్రకారం సినిమాలపై స్థానిక సంస్థల పన్నును రద్దు చేయాలని, చిన్న సినిమాలకు ఇచ్చే సబ్సిడీని పెంచాలని కోరారు.
Advertisement
Vishal
Tamil Nadu
C Joseph Vijay
Raj Mohan
Tamil Cinema
Film Technology
Online Ticketing
Local Body Tax
Film Subsidy

More Telugu News