ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
- ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
- పరీక్షకు 23,198 మంది విద్యార్థులు హాజరు
- 21,205 మంది ఉత్తీర్ణులయినట్లు వెల్లడి
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 23,198 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఇందులో 21,205 మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. ఉత్తీర్ణత శాతం 91.41 అని తెలిపారు.
ర్యాంకు కార్డులు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా పలితాలు తెలుసుకోవచ్చు. ఏపీ ఐసెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలియజేశారు.