పార్టీలో ఉండాలనుకునే వారు ఉండొచ్చు.. వద్దనుకుంటే వెళ్ళవచ్చు: మమతా బెనర్జీ

  • టీఎంసీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో మమతా బెనర్జీ భేటీ
  • పార్టీ తిరిగి పుంజుకుంటుందని మమతా బెనర్జీ ధీమా
  • టీఎంసీ ఎప్పటికీ తలవంచదన్న మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు తలెత్తాయనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. పార్టీలో ఉండాలనుకునే వారు ఉండవచ్చని, వద్దనుకునే వాళ్ళు వెళ్ళిపోవచ్చని ఆమె స్పష్టంగా చెప్పినట్లు టీఎంసీ వర్గాలు వెల్లడించాయి.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో కాళీఘాట్‌లోని తన నివాసంలో మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ పార్టీ తిరిగి పుంజుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ మారాలనుకునే వారిని వెళ్ళనీయండని, కానీ పార్టీని కొత్తగా నిర్మిస్తానని ధీమా వ్యక్తం చేశారు. దెబ్బతిన్న పార్టీ కార్యాలయాలను పునర్నిర్మించాలని సూచించారు. వాటికి రంగులు వేద్దామని, అవసరమైతే తాను కూడా వేస్తానని తెలిపారు. టీఎంసీ ఎప్పటికీ తలవంచదని అన్నారు. ప్రజల తీర్పును వారు దొంగిలించారని విమర్శించారు.

Mamata Banerjee
Trinamool Congress
TMC
West Bengal Assembly Elections
Abhishek Banerjee

More Telugu News