అస్సాం చిన్నారి ‘వచ్చిందమ్మా’ సాంగ్‌కు నారా లోకేశ్‌ ఫిదా

Nara Lokesh Impressed by Assam Girls Vachindamma Song
  • అస్సాం చిన్నారి నోట తెలుగు పాట
  • భారతీయుల గుండె చప్పుడు అంటూ లోకేశ్‌ పోస్ట్‌
  • సంగీతం, సంస్కృతులే దేశాన్ని ఏకం చేస్తాయని వ్యాఖ్య
అస్సాంకు చెందిన ఓ చిన్నారి తెలుగులో ఎంతో చక్కగా పాట పాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గీత గోవిందం’ సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘వచ్చిందమ్మా..’ను ఆ చిన్నారి ఎంతో సంతోషంగా, ఆనందంగా పాడడం విశేషం. దీన్ని చూసి మురిసిపోయిన లోకేశ్‌.. ఇదే భారతదేశపు నిజమైన ఆత్మ అని వ్యాఖ్యానించారు.

మన దేశంలో వేర్వేరు భాషలు, భిన్నమైన సంస్కృతులు ఉన్నప్పటికీ మనందరి గుండె చప్పుడు ఒక్కటేనని లోకేశ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి అద్భుతమైన క్షణాలు చూసినప్పుడు దేశంలో ఉండే రాజకీయాల కంటే కూడా సంగీతం, సంస్కృతులే భారతీయులందరినీ చాలా లోతుగా ఏకం చేయగలవనే విషయం స్పష్టమవుతోందని అన్నారు. అస్సాం చిన్నారి పాటతో ఇప్పుడు లోకేశ్‌ పోస్ట్‌ కూడా నెట్టింట ట్రెండ్‌ అవుతోంది.


Go Back to Shorts
Nara Lokesh
Assam
Vachindamma song
Geetha Govindam
Telugu song
Viral video
Indian culture
Unity in diversity
Social media
Telugu film song

More Telugu News