ఎల్లుండి అండమాన్ కు నైరుతి రుతుపవనాలు.. ఐఎండీ నివేదిక

  • ఎండలకు అల్లాడుతున్న ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ కేంద్రం
  • నైరుతీ రుతుపవనాలకు వాతావరణం అనుకూలంగా ఉందని వెల్లడి
  • మే 16 నాటికి అండమాన్ నికోబర్‌కు నైరుతి రుతుపవనాలు
అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎండలకు అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలకు వాతావరణం అనుకూలంగా ఉందని, మరో రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకొచ్చని తెలిపింది. తుపాను వలయం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించిందని, రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని పేర్కొంది.

ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎండలు మండిపోతున్నాయి. కొన్నిచోట్ల అకాల వర్షాలు పడుతున్నప్పటికీ, కాసేపటికి లేదా మరుసటి రోజు ఎండలు తీవ్ర ప్రతాపం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో నైరుతీ రుతుపవనాలు రానున్నయని వాతావరణ శాఖ తెలిపింది. మే 16 నాటికి నైరుతి రుతు పవనాలు అండమాన్ నికోబార్ చేరుకోవచ్చని అంచనా వేసింది. 

వాతావరణ శాఖ ప్రకారం, మే 13 నుంచి 19 వరకు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

IMD
India Meteorological Department
southwest monsoon
Andaman and Nicobar
Kerala monsoon

More Telugu News