వయసుపై చర్చ.. టబు అసహనం

Tabu expresses frustration over age discussions
  • మన వయసుపై ఇతరులకే ఎక్కువ ఆందోళన ఉంటుందంటూ టబూ ఎద్దేవా
  • వయసు పెరగడం అనేది సహజ ప్రక్రియ అని వ్యాఖ్య
  • మహిళల వయసు గురించి మాట్లాడటం బాధాకరమన్న టబూ

సినీ రంగంలో నటీమణుల వయసుపై సమాజం, పరిశ్రమ చూపిస్తున్న అత్యుత్సాహంపై టబు ఘాటుగా స్పందించారు. "మన వయసు గురించి మనకంటే ఇతరులకే ఎక్కువ ఆందోళన ఉంటుంది" అని ఆమె ఎద్దేవా చేశారు. వయసు పెరగడం అనేది సహజమైన ప్రక్రియ అని, అది ఒక్క రోజులో జరిగేది కాదని ఆమె గుర్తు చేశారు. మహిళలు సాధిస్తున్న విజయాల కంటే వారి వయసు గురించి చర్చించడం బాధాకరమని, దీనివల్ల నటీమణులపై అనవసరమైన ఒత్తిడి పెరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


సినిమాలను తిరస్కరించే విషయంలో తాను అనుసరించే పద్ధతిని కూడా ఆమె వివరించారు. చాలా మంది డేట్స్ లేవని అబద్ధం చెప్పమని సలహా ఇచ్చినా, తాను మాత్రం స్క్రిప్ట్ నచ్చకపోతే ఆ విషయాన్ని ముఖం మీదనే చెప్పేస్తానని టబు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె తన తాజా చిత్రం ‘భూత్ బంగ్లా’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్లమ్ డాగ్’ చిత్రంలో నటిస్తున్నారు. నాగార్జున 100వ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించబోతున్నారు.

Go Back to Shorts
Tabu
Tabu age
Bollywood actress
Bhuth Bangla movie
Slum Dog movie
Nagarjuna 100th movie
Indian cinema
actress age shaming
ageism
film industry

More Telugu News