ఢిల్లీలో మరో దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్‌రేప్

  • ఢిల్లీ నాంగ్లోయ్‌లో కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్‌రేప్
  • పని నుంచి ఇంటికి వెళ్తుండగా బాధితురాలిని బస్సులోకి లాగిన దుండగులు
  • ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇద్దరు నిందితుల అరెస్ట్
  • అత్యాచారానికి ఉపయోగించిన ప్రైవేట్ బస్సును స్వాధీనం చేసుకున్న అధికారులు
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాంగ్లోయ్ ప్రాంతంలో కదులుతున్న ప్రైవేట్ బస్సులో ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అత్యాచారానికి ఉపయోగించిన బస్సును కూడా స్వాధీనం చేసుకున్నట్లు గురువారం వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పితంపుర మురికివాడలో నివసించే బాధితురాలు మంగోల్‌పురిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మే 11న (సోమవారం) రాత్రి పని ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో సరస్వతి విహార్ వద్ద ఆగి ఉన్న ఒక స్లీపర్ బస్సు డోర్ వద్ద నిలబడిన వ్యక్తిని ఆమె టైమెంత అని అడిగింది. వెంటనే అతడు, మరో వ్యక్తి ఆమెను బలవంతంగా బస్సులోకి లాగారు.

అనంతరం వారు బస్సును రాణి బాగ్ నుంచి నాంగ్లోయ్ వైపు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివాహిత అయిన బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం రాణి బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, మే 9న పశ్చిమ ఢిల్లీలోని జనక్‌పురిలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో మూడేళ్ల చిన్నారిపై 57 ఏళ్ల పాఠశాల సిబ్బంది అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కూడా నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. 

Delhi Gang Rape
Delhi Crime
Gang Rape Case
Nangloi
Delhi Police
Crime in Delhi
Rani Bagh
Sexual Assault
Janakpuri
POCSO Act

More Telugu News