హ్యాక్ చేయడం అసాధ్యం... శ్రీవాణి ట్రస్ట్ టికెట్లపై టీటీడీ క్లారిటీ
- కొంతమంది దళారులు భక్తులను తప్పుదోవ పట్టించి నకిలీ టిక్కెట్లు విక్రయిస్తున్నారన్న టీటీడీ
- అలాంటి వారిపై టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిక
- శ్రీవాణి టికెట్ బుకింగ్ సైట్‌ను హ్యాక్ చేయడం సాధ్యం కాదన్న టీటీడీ
సామాజిక మాధ్యమాల్లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి వస్తున్న వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది. కొంతమంది దళారులు భక్తులను తప్పుదోవ పట్టించి నకిలీ టికెట్లు విక్రయిస్తున్నారని పేర్కొంది. అలాంటి వారిపై టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. శ్రీవాణి దర్శన టికెట్లపై ఎలాంటి అసత్య ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని కోరింది.
శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల బుకింగ్ విధానాన్ని 2019 మే నెలలో ప్రవేశపెట్టినట్టు గుర్తు చేసింది. ఇందులోని లోటుపాట్లు, భక్తుల నుంచి వచ్చే సూచనలు, సలహాల మేరకు 2024 జూన్ నుంచి భక్తులకు పారదర్శకంగా సేవలందించేందుకు బుకింగ్ విధానాన్ని పటిష్ఠంగా రూపొందించినట్లు తెలిపింది. కాబట్టి శ్రీవాణి టికెట్ బుకింగ్ సైట్‌ను హ్యాక్ చేయడం, వ్యవస్థలో చొరబడటం సాధ్యం కాదని స్పష్టం చేసింది. భక్తులు అపోహలకు గురికావొద్దని కోరింది.
కొందరు దళారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్దతుల ద్వారా వేగంగా వివరాలు నమోదు చేసి టికెట్లను బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపింది. అలాంటి వాటిని టీటీడీ ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత అక్రమ ఐడీలు, అక్రమ బుకింగ్ విధానాలను వెంటనే నిరోధించడంతో పాటు సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నట్లు తెలిపింది. నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు తెలిపింది.