అమూల్ పాల ధరలు పెరిగాయి... రేపటి నుంచే!

  • లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతూ నిర్ణయం
  • పాల రకాన్ని బట్టి 2.5 శాతం నుంచి 3.5 శాతం మేర ధరల పెరుగుదల
  • మదర్ డెయిరీ పాల ధరలు కూడా పెంపు
అమూల్, మదర్ డెయిరీలు పాలు, పాల పదార్థాల ధరలను పెంచాయి. ఇతర కంపెనీలు కూడా ఇదే దారిలో నడిచే అవకాశాలు ఉన్నాయి. అమూల్ బ్రాండ్లపై పాల ఉత్పత్తులు విక్రయించే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ పాల ధరలను పెంచింది. లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి (మే 14వ తేదీ) పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది.

అమూల్ స్టాండర్డ్ మిల్క్, గేదె పాలు, ఆవు పాలు, గోల్డ్, స్లిమ్ అండ్ ట్రిమ్, టీ స్పెషల్ పాల ధరలు లీటరుకు రూ.2 చొప్పున పెరగనున్నాయి. అమూల్ గత సంవత్సరం మే 1వ తేదీన చివరిసారి ధరలను సవరించింది. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అమూల్ తెలిపింది. పశువుల దాణా, ప్యాకేజీంగ్ ఖర్చులు, చమురు ధరలు పెరుగుదల దీనికి కారణమని తెలిపింది. పాల రకాన్ని బట్టి లీటరుకు 2.5 నుంచి 3.5 శాతం మేర ధరలు పెరుగుతాయి.

మదర్ డెయిరీ కూడా పాల ధరను పెంచింది. లీటరుకు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. మే 14 నుంచి పెరిగిన పాల ధరలు అమల్లోకి రానున్నాయని తెలిపింది.

Amul
Amul milk price hike
Mother Dairy
milk prices
Gujarat Cooperative Milk Marketing Federation

More Telugu News