త్రిష-సూర్య కొత్త చిత్రం 'కరుప్పు' ప్రత్యేక ప్రదర్శనలకు తమిళనాడులో అనుమతి

Suriya and Trishas Karuppu Movie Gets Special Shows in Tamil Nadu
  • సూర్య, త్రిషల కొత్త చిత్రం 'కరుప్పు'
  •  ప్రత్యేక ప్రదర్శనలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి
  •  మే 14, 15 తేదీల్లో రోజుకు 5 షోలు ప్రదర్శించే వెసులుబాటు
  •  సీఎం విజయ్‌కు కృతజ్ఞతలు తెలిపిన చిత్ర నిర్మాణ సంస్థ
  •  అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే రూ. 2 కోట్లకు పైగా వసూళ్లు
ప్రముఖ నటుడు సూర్య, త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన  చిత్రం 'కరుప్పు'కు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇచ్చింది. మే 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సందర్భంగా, మే 14, 15 తేదీల్లో స్పెషల్ షోలు వేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
చిత్ర నిర్మాతల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం, ఈ రెండు రోజులు ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు థియేటర్లలో రోజుకు గరిష్టంగా ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చు. ఈ ప్రత్యేక ప్రదర్శనల సమయంలో థియేటర్ల వద్ద భద్రతా జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం థియేటర్ యాజమాన్యాలకు సూచించింది.

ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చినందుకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు చిత్ర నిర్మాణ సంస్థ ధన్యవాదాలు తెలిపింది. సూర్య, త్రిష ప్రదాన పాత్రల్లో నటిస్తుండగా, బాలాజీ కీలక పాత్ర పోషించారు. తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదల కానుంది.

కాగా, కొంత కాలంగా తమిళనాడులో ప్రత్యేక ప్రదర్సనలు లేవన్న సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి విజయ్ ముఖ్యమంత్రిగా ఉండటంతో స్పెషల్ షోలకు అనుమతి ఇస్తారని సినీ అభిమానులు ఆశించారు. అందరూ అనుకున్నట్లుగానే ప్రభుత్వం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇవ్వడంతో కోలీవుడ్ లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.  
Advertisement
Suriya
Trisha Krishnan
Karuppu Movie
Tamil Nadu Special Shows
RJ Balaji
Veerabhadradu Movie
Tamil Cinema
Kollywood News
Dream Warrior Pictures
Vijay Tamil Nadu CM

More Telugu News