మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు భక్తుల మృతి
- మహారాష్ట్ర సాంగ్లీలో భారీ వర్షం కారణంగా కూలిన ఆలయ గోడ
- మరికొందరికి తీవ్ర గాయాలు
- మృతుల్లో కర్ణాటకకు చెందిన భక్తులు
- ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
- మర్గుబాయి దేవి జాతర సందర్భంగా ఘటన
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా ఓ ఆలయ ప్రాంగణంలోని గోడ కూలిపోవడంతో ఆరుగురు భక్తులు మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. మంగళవారం జత్ తహసీల్‌లోని మోతేవాడి గ్రామంలో ఉన్న మర్గుదేవి ఆలయంలో ఈ దుర్ఘటన జరిగింది.
మర్గుబాయి దేవి వార్షిక జాతర సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో వర్షం నుంచి రక్షణ పొందేందుకు చాలామంది భక్తులు ఆలయ ప్రాంగణంలోని గోడ, రేకుల షెడ్డు కిందకు చేరారు. గాలుల తీవ్రతకు తట్టుకోలేక ఆ గోడ, రేకులు ఒక్కసారిగా వారిపై కూలిపోయాయి.
ప్రమాద సమయంలో ఆలయ ప్రాంగణంలో దాదాపు 350 మంది ఉన్నారని సాంగ్లీ ఎస్పీ తుషార్ దోషి తెలిపారు. మృతుల్లో ముగ్గురు స్థానికులు కాగా, మరో ముగ్గురు కర్ణాటకలోని బీజాపూర్ తాలూకాకు చెందినవారని గుర్తించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు, అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీశారు.
ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "సాంగ్లీలో గోడ కూలిన ఘటనలో ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ఆయన 'ఎక్స్' లో పోస్ట్ చేశారు.