రూ. 30 వేల కోట్ల కపూర్ కుటుంబ ఆస్తి వివాదం.. 'మహాభారతాన్ని మించిపోయింది' అన్న సుప్రీంకోర్టు
- రూ. 30,000 కోట్ల సంజయ్ కపూర్ కుటుంబ ఆస్తి వివాదం
- సుప్రీంకోర్టుకు చేరిన వ్యవహారం
- మహాభారతంతో పోల్చిన ధర్మాసనం
- మాజీ సీజేఐ చంద్రచూడ్ మధ్యవర్తిత్వానికి అంగీకారం
- వివాదంలో బహుముఖ కోణాలు.. పలు కేసులు
ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ మరణంతో మొదలైన రూ. 30,000 కోట్ల వారసత్వ వివాదం మరింత ముదురుతోంది. కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుండగా, ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఇందులో నటి కరిష్మా కపూర్ పేరు కూడా ముడిపడి ఉంది. ఈ వివాదంపై విచారణ సందర్భంగా జస్టిస్ జేబీ పార్థీవాలా నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "మేము ఒక ఘట్టంలోకి ప్రవేశించాం. దీని ముందు మహాభారతం కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది" అని వ్యాఖ్యానించి, ఈ వివాద తీవ్రతను తెలియజేసింది.
గతేడాది జూన్‌లో ఇంగ్లండ్‌లో పోలో ఆడుతూ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ మరణించారు. కాగా, ఆయన తల్లి రాణి కపూర్ (80) నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కుటుంబ ఆస్తులలో కీలకమైన రఘువంశీ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఐపీఎల్) బోర్డు ఈ నెల 18న సమావేశం కాకుండా నిరోధించాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు. కోర్టు ఆదేశించిన మధ్యవర్తిత్వ ప్రక్రియను పక్కనపెట్టేందుకు ఇది ఒక మోసపూరిత ప్రయత్నమని ఆమె ఆరోపించారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 14న విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.
ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు గత వారం సుప్రీంకోర్టు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ను మధ్యవర్తిగా నియమించిన విషయం తెలిసిందే. ఆర్‌కే ట్రస్ట్, సోనా కామ్‌స్టార్‌తో పాటు కపూర్ కుటుంబానికి చెందిన కంపెనీలకు సంబంధించిన వివాదాలను ఆయన పరిష్కరించనున్నారు. అసలు ఈ ఆర్‌కే ట్రస్ట్ చట్టవిరుద్ధమని, ఫోర్జరీ, మోసంతో దానిని సృష్టించారని రాణి కపూర్ గతంలోనే హైకోర్టులో సివిల్ దావా వేశారు.
అయితే, ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియలో సంజయ్ కపూర్ రాసిన వీలునామాకు సంబంధించిన వివాదం లేదు. ఆ వీలునామాపై సంజయ్ కపూర్ మూడో భార్య ప్రియా కపూర్‌కు, ఆయన రెండో భార్య, నటి కరిష్మా కపూర్‌కు పుట్టిన పిల్లలు కియాన్, సమీరా కపూర్‌లకు మధ్య వేరే న్యాయపోరాటం జరుగుతోంది. సంజయ్ కపూర్ వీలునామాను ప్రియా కపూర్ ఫోర్జరీ చేశారని పిల్లలు ఆరోపిస్తున్నారు.
ఇది కాకుండా ప్రియా కపూర్‌కు, సంజయ్ కపూర్ సోదరి మందిరా కపూర్ స్మిత్‌కు మధ్య పరువునష్టం కేసు కూడా నడుస్తోంది. ఈ కుటుంబ వివాదాలు బహుముఖ కోణాల్లో కొనసాగుతుండటంతో న్యాయస్థానాలు సైతం విసిగిపోతున్నాయి. ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు ఇరు పక్షాలను గౌరవంగా ప్రవర్తించాలని మందలించాల్సి వచ్చింది.