డాక్టర్ నమ్రత చర్య సమాజం తలదించుకునేలా ఉంది: సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
- సృష్టి ఫెర్టిలిటీ సరోగసి స్కాంలో డాక్టర్ నమ్రతకు చుక్కెదురు
- నమ్రత పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు
- వైద్య వృత్తికే తలవంపులు తెచ్చారన్నధర్మాసనం
- ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సరోగసి కుంభకోణంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ నమ్రతకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, వైద్య వృత్తికే తలవంపులు తెచ్చేలా ఉందని అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ నమ్రత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, ఆమెకు ఎలాంటి ఉపశమనం కల్పించలేమని సోమవారం స్పష్టం చేసింది.
రాజస్థాన్‌కు చెందిన దంపతులు తమకు సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా చెప్పి, రూ.35 లక్షలు తీసుకుని వేరే శిశువును అప్పగించారని 2024 జూలైలో హైదరాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. డీఎన్‌ఏ పరీక్షలో ఆ బిడ్డకు, తమకు సంబంధం లేదని తేలడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత తెలంగాణ, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి కూడా బాధితులు ముందుకు రావడంతో 15కు పైగా కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగి, నమ్రతకు చెందిన రూ.30 కోట్ల ఆస్తులను గుర్తించి, 8 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. 2026 ఫిబ్రవరి 13న ఆమెను అరెస్టు చేసింది. ఈ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ మొదట హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ పిటిషన్ కొట్టివేతకు గురైంది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఎదుట జరిగిన విచారణలో, అరెస్టు సమయంలో అధికారులు ఆర్టికల్ 22ను ఉల్లంఘించారని నమ్రత తరఫు న్యాయవాది వాదించారు. అయితే, ధర్మాసనం ఈ వాదనలతో ఏకీభవించలేదు. "ఆరోపణలు చిన్నవేమీ కావు. ఆమె చేసింది అభినందనీయం కాదు" అని వ్యాఖ్యానించింది. ఈడీ అరెస్టు చేస్తే నేరుగా సుప్రీంకోర్టుకు రావడం సరైన ప్రక్రియ కాదని, ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఈ దశలో కేసులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.